అతిథులకు ఆహ్వానం.. పెళ్లికి ఎవరూ రావొద్దు.. మాజీ ఎమ్మెల్యే విన్నపం!

అతిథులకు ఆహ్వానం.. పెళ్లికి ఎవరూ రావొద్దు.. మాజీ ఎమ్మెల్యే విన్నపం!

Updated On : December 24, 2020 / 1:27 PM IST

Wedding Invitation to Guests : ఇదిగో మా ఆహ్వానం… మా ఇంట్లో పెళ్లికి ఎవరూ రావొద్దు.. అంటూ ఓ ప్రముఖ రాజకీయ నేత ఇలా వినూత్నంగా విన్నపించుకున్నారు. సాధారణంగా ప్రముఖ నేత ఇంట్లో పెళ్లంటే ఎంత అట్టహాసంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులోనూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె పెళ్లంటే జనంతో సందడితో నిండిపోతుంది.

అలాంటిది జనవరి 3వ తేదీన జరిగే తన కుమార్తె వివాహానికి ఎవరూ రావొద్దని ఆయన కోరాల్సిన పరిస్థితి ఎదురైంది. కరోనా నిబంధనలే ఇందుకు కారణమంట.. అందుకే పెళ్లికి పిలిచే అతిథులకు ఆహ్వాన పత్రికను పంపారు. ఆహ్వాన పత్రికతోపాటు స్వీట్ బాక్సు కూడా అందించారు. బాక్సు వెనుక ఒక సందేశాన్ని ఇలా ముద్రించారు.

‘నూతన దంపతులకు ఆశీస్సులు అందించమని మిమ్మల్ని ఆహ్వానించడానికి కరోనా నిబంధనలు ఆటంకంగా ఉన్నాయి. మీరు మీ ఇళ్ల నుంచే వధూవరులకు శుభాశీస్సులు అందించాలని కోరుతున్నాను’ అని విన్నవించుకున్నారు. ఈ ఆహ్వాన పత్రికతో కూడిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..