వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి. వెంకట సిద్ధారెడ్డిని పార్టీ నుంచి ..

వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

Ysrcp Suspends Sidda Reddy

Updated On : July 10, 2024 / 11:27 AM IST

Ysrcp Suspends Sidda Reddy : వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి. వెంకట సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్సెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో సిద్ధారెడ్డిని సస్సెండ్ నుంచి చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.

Also Read : Anasuya – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. చిన్న పాత్ర చేశాను అంటూ..

నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. వాటిపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడి నిర్ణయంతో వెంకట సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Also Read : మంత్రివర్గ విస్తరణకు ఎందుకు బ్రేక్ పడింది.? కారణం ఆ జిల్లా సీనియర్లేనా?

YCP Party