Proddatur : 300 కిలోల బంగారం సీజ్..? కడప జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ సోదాల కలకలం
నాలుగు రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలోని పలు బంగారు దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తనిఖీలు నిర్వహించారు. Proddatur Gold Shops

IT Raids In Proddatur Gold Shops
IT Raids In Proddatur Gold Shops : కడప జిల్లా ప్రొద్దూటూరులో ఐటీ సోదాలు ముగిశాయి. బంగారు దుకాణాల్లో దాదాపు 4 రోజులుగా తనిఖీలు చేపట్టిన అధికారులు పలు వస్తువులు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సామగ్రి, బంగారాన్ని తమ వాహనాల్లో తీసుకెళ్లారు. ప్రొద్దుటూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలోనే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
గత నాలుగు రోజులుగా దాదాపు 6 షాపుల్లో తనిఖీలు చేశారు అధికారులు. దాదాపు 300 కేజీల గోల్డ్ సీజ్ చేసి ఐటీ శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి తమకు అధికారం లేదని, ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలోనే పూర్తిగా రికార్డులన్నీ పరిశీలించాకే వివరాలు వెల్లడిస్తామన్నారు.
Also Read : రూ.15కోట్ల నగదు సీజ్.. AMR గ్రూప్ సంస్థలపై ముగిసిన ఐటీ సోదాలు
నాలుగు రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలోని పలు బంగారు దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. బిల్లులు లేకపోవడంతో పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఈ నాలుగు రోజులు తనిఖీలు నిర్వహించారు అధికారులు.
ప్రొద్దూటూరు చాలా ఫేమస్. రెండో ముంబైగా గుర్తింపు పొందింది. గోల్డ్ షాపులకు ప్రొద్దుటూరు ప్రసిద్ది. పెద్ద సంఖ్యలో ఇక్కడ బంగారం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పసిడి వ్యాపారం జరుగుతుంది. అందుకే, సిటీ ఆఫ్ గోల్డ్ గా ఈ పట్టణాన్ని పిలుస్తారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో పసిడి కొనుగోళ్లు జరుగుతాయి. గోల్డ్ షాపులకు ఫేమస్ కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పుత్తడి కొనుగోలు చేసేందుకు ప్రొద్దుటూరుకి వస్తారు. పెద్ద మొత్తంలో గోల్డ్ కొనుగోలు చేయాలంటే ప్రొద్దుటూరులో కొనేందుకు ఆసక్తి చూపిస్తారు కొనుగోలుదారులు.
Also Read : శ్రీవారి భక్తులకు హైకోర్టులో చుక్కెదురు.. టీటీడీ కల్పించిన దర్శనం చేసుకోవాలని ఆదేశం