Fire Four Kills : విశాఖలో అగ్ని ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం…మృతిపై అనుమానాలు

విశాఖ మధురవాడలో తెల్లవారుజామున ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు....ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నలుగురు ప్రాణాలు విడిచారు.

Fire Four Kills : విశాఖలో అగ్ని ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం…మృతిపై అనుమానాలు

Four Kills In The Same Family In Fire Accident

Updated On : April 15, 2021 / 3:30 PM IST

four kills in the same family in Fire accident : విశాఖ మధురవాడలో తెల్లవారుజామున ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు….ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నలుగురు ప్రాణాలు విడిచారు. దీంతో అపార్ట్‌మెంట్‌లో భయానక వాతావరణం నెలకొంది. మొదట అగ్ని ప్రమాదంతోనే మృతి చెందారని భావించారు. కానీ మృతదేహాలపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఆదిత్యా అపార్ట్‌మెంట్‌లో బంగారునాయుడు కుటుంబం నివాసం ఉంటోంది. వీరు విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన వారని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల క్రితం వరకూ విదేశాల్లో ఉన్న ఈ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం ఇటీవలే విశాఖకు మారింది. వీరి పెద్ద కుమారుడు దీపక్ ఎన్‌ఐటీలో చదువుకుంటూ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఆనందంగా ఉన్న ఆ ఇంట్లో నలుగురూ మృతి చెందడం కలకలం రేపుతోంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో డెడ్‌బాడీలపై గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ముగ్గురి మృతదేహాలు ఒకచోట, దీపక్ డెడ్‌బాడీ మరోచోట పడి ఉంది. మృతులు సుంకర బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్, కశ్యప్‌లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఘటనకు ముందు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానిక మహిళ చెబుతోంది. .

ఫ్యామిలీ మెంబర్స్‌ను పెద్దకొడుకు దీపక్ చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే దీపక్‌ కొంత కాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో దీపక్ మినహా మిలిగిన మృతదేహాలపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు.. దీపకే ముగ్గురిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.