ఏపీలో 19కి చేరిన కరోనా కేసులు…గుంటూరులో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్ 

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 06:24 PM IST
ఏపీలో 19కి చేరిన కరోనా కేసులు…గుంటూరులో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్ 

Updated On : March 28, 2020 / 6:24 PM IST

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం (మార్చి 28, 2020) ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త బులిటెన్ విడుదల చేసింది. 

విజయవాడలో మూడు కేసులు 
ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి మొదటిసారి ఏ వ్యక్తికి అయితే వచ్చిందో ఆ వ్యక్తి కుటుంబంలోని మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో గుంటూరులో ప్రస్తుతం నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలో ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. వారు చికిత్స పొందుతున్నారు. నాలుగో కేసుగా 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తోంది. అతను ఇటీవలే మక్కా మసీదు యాత్రకు వెళ్లి వచ్చినట్లు అధికారిక లెక్కల ద్వారా సమాచారం. 

ఒంగోలులో భార్యభర్తకు పాజిటివ్
ఒంగోలుకు సంబంధించి చీరాల నియోజకవర్గంలో ఒక కుటుంబంలోని భార్యభర్తకు పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలుకు సంబంధించి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ మెన్ గా పని చేస్తున్న 23 ఏళ్ల యువకుడికి పాజిటివ్ వచ్చినట్లుగా అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇంకా 20 నుంచి 30 మంది వరకు రిజల్ట్ రావాల్సి నవారు వెయిటింగ్ లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రేపు సాయంత్రానికి వీరికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టులు కూడా వస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు 
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. సంజామల మండలం నొస్సంలో రాజస్తాన్ కు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ గా రిపోర్టుల్లో వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నొస్సం గ్రామానికి 3 కిమీ చుట్టూ కరోనా జోన్, 7 కిమీ వరకు కరోనా బఫర్ జోన్ గా కలెక్టర్ వీర పాండియన్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులకు కరోనా సోకింది. ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్ వార్డులో వారికి చికిత్స అందిస్తున్నారు. దంపతుల కొడుకు, కోడలు, మనవరాలిని సైతం రిమ్స్ లోని క్వారంటైన్ కు తరలించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాట్లు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరిందంటే పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో స్టేజ్ 2 ..కాంటాక్టు ద్వారా వచ్చినటువంటి కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. రేపటి నుంచి మరింత వేగంగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష 
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి సీఎంతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో చర్చించినట్టు ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి సాయం చేయాలని కోరినట్టు తెలిపారు. అక్కడి కూలీలు, కార్మికుల కోసం ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలిపారు. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడామన్నారు.  
విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక శ్రద్ధ 
ఏపీలో మొత్తం 13 కేసుల్లో 12 కేసులు కేవలం పట్టణాల్లోనే బయటపడ్డాయని చెప్పారు. కరోనా నివారణకు పట్టణాలు, నగరాల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక డాక్టర్ ని, నిపుణుడిని అందుబాటులో ఉంచామన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.