గర్భిణీలకు సరఫరా చేసే పాల ప్యాకెట్‌లో కప్ప

గర్భిణీలకు సరఫరా చేసే పాల ప్యాకెట్‌లో కప్ప

Updated On : December 16, 2020 / 4:55 PM IST

Frog in a milk packet : అంగన్ వాడీ కేంద్రంలో కలకలం రేగింది. గర్భిణీలకు సరఫరా చేసే మిల్క్ ప్యాకెట్‌లో కప్ప దర్శనమిచ్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సిబ్బంది తెలియచేశారు. మొన్నటికి మొన్న శనక్కాయలో పురుగులు బయటపడిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో గర్భిణీలకు సరఫరా చేసే పాల ప్యాకెట్లలో ఓ ప్యాకెట్‌లో కప్ప బయటపడింది. అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన విజయ వజ్ర పాల ప్యాకెట్‌ లో కప్ప దర్శనమిచ్చింది. పాలలో కప్పను చూసిన మహిళ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. గర్భిణిలు, బాలింతల్లో రక్తహీనత సమస్యను నివారించేందుకు అంగన్ వాడీల ద్వారా ప్రభుత్వం పాలను సరఫరా చేస్తోంది. ఇప్పటికే గడువుతీరిన పాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అది చాలదనట్లు ఇప్పుడు పాల ప్యాకెట్‌లో కప్ప రావడంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు.

ఘటనపై ఉన్నతాధికారులకు అంగన్వాడి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. శనక్కాయలో పురుగులు బయటపడిన ఘటన మరువకముందే ఇప్పుడు పాల ప్యాకెట్‌లో కప్ప కనపడటంతో జిల్లా వ్యాప్తంగా భయందోళనలు నెలకోన్నాయి. రెండు రోజుల ముందు బొమ్మనహాల్‌ మండలం చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన శనక్కాయ భర్ఫీలో పురుగులు కనిపించాయి.