NZ Youth Parliament : తెలుగమ్మాయికి అరుదైన గౌరవం..న్యూజిలాండ్ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక

మేఘన ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన ఈమెకు పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు...

NZ Youth Parliament : తెలుగమ్మాయికి అరుదైన గౌరవం..న్యూజిలాండ్ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక

Meghana

Updated On : January 16, 2022 / 3:51 PM IST

Gaddam Meghana : తెలుగింటి అమ్మాయిలు అరుదైన గౌరవం దక్కించుకుంటున్నారు. న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ప్రకాశం జిల్లా టంగటూరుకు చెందిన మేఘన ఎంపికయ్యారు. సేవా కార్యక్రమాలు, యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే…పార్లమెంట్ సభ్యురాలిగా ఈమె వాల్కటో ప్రాంతం నుంచి ఎంపికయ్యారు. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు.

Read More : Car Accident: మితిమీరిన వేగం.. వృద్ధుడిపైకి దూసుకెళ్లిన కారు

ఆమె తండ్రి గడ్డం రవికుమార్ 2001లోనే న్యూజిలాండ్ కు వెళ్లారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన…కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో స్టడీ చేశారు. వివిధ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేఘన…అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరించారు. వలస వస్తున్న శరణార్థుల విషయంలో చొరవ తీసుకుంటున్నారు. వారి సమస్యలు..వారికి విద్య, ఆశ్రయం..ఇతర వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మేఘన ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన ఈమెకు పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు.