Gold Price Today: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే ..
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి ధర..

Gold
Gold and Silver Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ. 50 తగ్గింది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. గత రెండు రోజులుగా వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. తాజాగా తగ్గిన బంగారం ధరలతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభిస్తుంది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది. అయితే, మంగళవారం 10 గ్రాముల బంగారంపై రూ. 50మేర తగ్గింది. దీంతో మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,400 వద్ద కొనసాగుతోంది.

Gold
దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 54,600 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,550గా ఉంది. అదేవిధంగా ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,400గా ఉంది. బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,400గా ఉంది. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,750 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,750 (10గ్రాములకు రూ.30 తగ్గింది) గా ఉంది. కోల్‌కతాలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,400గా ఉంది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి ధర రూ. 80వేల వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగాప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే .. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,900 కాగా, ముంబైలో రూ. 76,400, చెన్నైలో రూ. 80వేలు, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500 లుగా ఉంది.