Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
ఆ సంఖ్య పెంచాలని నిరుద్యోగులు కోరారు. దీంతో వారిని సానుకూలంగా..

AP Govt
Contract employees: ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ తాజాగా గెజిట్ జారీ చేశారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP
అలాగే, నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కారు జీవో జారీచేసిన విషయం తెలిసిందే. ఆ సంఖ్య పెంచాలని నిరుద్యోగులు కోరారు. దీంతో వారిని సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఏపీపీఎస్సీ మొత్తం 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Pawan Kalyan: మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్