AP Assembly Sessions: అసెంబ్లీ సెషన్‌కు ముందే ఏపీ పాలిటిక్స్ హైవోల్టేజ్ హీటెక్కుతున్నాయి. ఫేక్ ప్రచారం చేయడం కాదు..దమ్ముంటే అసెంబ్లీకి రండి తేల్చుకుందామని చంద్రబాబు బిగ్ సవాల్ చేశారు. అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడు రాకపోతే అడుగు అంటూ వైసీపీ రివర్స్ అటాక్ చేస్తోంది. అయితే హోదాపై కూడా విపక్షానికి అదే రేంజ్‌లో ఇచ్చిపడేశారు సీఎం చంద్రబాబు. అటు విపక్ష నేత అసెంబ్లీకి అటెండ్ కావొద్దని డిసైడ్ అయ్యారట. ఈ సారి అసెంబ్లీ సెషన్ కూడా వార్ వన్ సైడ్ అన్నట్లుగానే ఉంటుందా.? వైసీపీ సభకు హాజరుకావొద్దని డిసైడ్ కావడానికి రీజన్ అదేనా.?
ఎప్పుడూ ఏదో ఒక రచ్చ కామన్. ఇష్యూ ఏదైనా కూటమి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ నెక్స్ట్ లెవల్‌లో నడుస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ సెంట్రిక్‌గా కాస్త గట్టిగానే మాటల తూటాలు పేలుతున్నాయి. కాకపోతే ఈ సారి సీఎం చంద్రబాబు బిగ్ సవాల్ విసురుతూ పొలిటికల్ హీట్ పెంచారు. వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డ బాబు..దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా వైసీపీకి, జగన్‌కు సవాల్ చేశారు.
అయితే తాము సభకు రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముందు నుంచి పట్టుబడుతోంది వైసీపీ. ఇప్పుడు చంద్రబాబు సవాల్‌పై రియాక్ట్ అవుతూ మళ్లీ అదే డిమాండ్‌ను రిపీట్ చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాను కాదని..ప్రజలే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటున్నారు సీఎం చంద్రబాబు.
దీంతో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాకముందే రాజకీయం రంజుగా మారింది. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని చంద్రబాబు..హోదా ఇచ్చి చూడు రాకపోతే అడుగు అని వైసీపీ..తగ్గేదేలే అన్నట్లుగా పోటాపోటీగా స్టేట్‌మెంట్లు ఇస్తూ హీట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసారి కూడా అసెంబ్లీకి అటెండ్ కావొద్దని జగన్ డిసైడ్ అయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటూ సన్నిహితులతో డిస్కషన్‌లో చెప్పారట జగన్.
వైసీపీ ఓడిపోయి 15 నెలలు అయింది. అయితే 11 సీట్లు మాత్రమే వచ్చిన వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా కావాలని అంటోంది. రూల్స్ తెలుసుకోకుండా ప్రతిపక్ష హోదా అడగడమేంటని చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. హోదా ఇవ్వు సీఎం సీటు ఇవ్వు అంటే ఇచ్చేస్తారా అని సెటైర్లు పేల్చారు. హోదా ఎవరికైనా ఇచ్చేది ప్రజలు అని అన్నారు. తాము హోదా ఇవ్వలేదని విమర్శలు చేయడమేంటని ఆయన మండిపడ్డారు.
మరోవైపు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. వారు అసెంబ్లీకి వస్తే తాను ఎమ్మెల్యేలందరికీ తగిన సమయం ఇస్తానంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలు అని మాత్రమే చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా అన్నది మాత్రం ప్రస్తావించలేదు.
జగన్‌ను కూడా ఒక ఎమ్మెల్యేగానే సభా నిబంధనల ప్రకారం చూస్తున్నట్లుగానే చెప్పకనే చెప్పారు స్పీకర్. ఈ నేపథ్యంలోనే జగన్ అసెంబ్లీ అటెండ్ కావొద్దని ముందే డిసైడ్ అయ్యారని అంటున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి వస్తారని ముందుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ రాద్ధాంతం అటూ ఇటూ మాటలు, డిమాండ్లు సిచ్యువేషన్స్ మారిన వేళ..జగన్ సభకు రావొద్దని డెసిషన్ తీసుకున్నారట.
వైసీపీ ముందు నుంచి డౌట్ పడుతున్నట్లు ఎమ్మెల్యేలకు అంటే 5, 10 నిమిషాల సమయమే ఇస్తారు. అపోజిషన్ హోదా ఉంటే..జగన్ ఎప్పుడైనా..ఏ సబ్జెక్ట్‌పై అయినా మధ్యలో కలగజేసుకుని మాట్లాడొచ్చు. ప్రతిపక్ష హోదా లేకపోతే ఈ అవకాశం ఉండదు. ఎమ్మెల్యేకు ఇచ్చిన సమయమే ఇస్తారని అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్లి కూటమి సభ్యులు చెప్పే గొప్పలు వినడం తప్ప ప్రశ్నించే అవకాశం ఉండదంటోంది వైసీపీ.
ప్రతిపక్ష హోదాకు ముడి పెట్టి అసెంబ్లీకి రాము అన్నది వైసీపీ లైన్ అయితే దానినే రాజకీయ రచ్చగా చర్చగా ముందు పెట్టి టీడీపీ కూటమి పైఎత్తు వేస్తోంది. అయితే ప్రతిపక్ష హోదాలు ప్రోటోకాల్స్ అన్నవి టెక్నికల్‌గానే చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ సభకు వెళ్తున్నారా లేదా తమ తరఫున ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారా లేదా అన్నదే జనాలు గమనిస్తారంటున్నారు.
జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే సభ వన్‌సైడ్‌గా నడిచే అవకాశం లేకపోలేదు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను లేవనెత్తి..వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లు, తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. రుషికొండ, సుగాలి ప్రీతి కేసు, జగన్ పర్యటనలు ఇలా అన్ని అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు కూటమి అస్త్రాలు రెడీ చేసుకుంటోంది.
వైసీపీ మాత్రం యథావిధిగానే అసెంబ్లీలో కూటమి చేసే విమర్శలకు..ప్రెస్‌మీట్ల ద్వారే కౌంటర్ ఇచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే కానీ అసలు సీన్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు, వరుసగా ఢిల్లీ పర్యటనలు.. అసలు లోకేశ్ వ్యూహం ఏంటి?