లీడర్‌, క్యాడర్‌ గప్‌చుప్‌..ఇట్లైతే ఫ్యాన్‌ తిరిగేదెట్లా.?

ఏపీలో వైసీపీ పార్టీ విచిత్ర పరిస్థితిని ఫేస్ చేస్తుంది.

లీడర్‌, క్యాడర్‌ గప్‌చుప్‌..ఇట్లైతే ఫ్యాన్‌ తిరిగేదెట్లా.?

Gossip Garrage Cadre Confusion Over Fan Party Future

Updated On : January 17, 2025 / 1:06 PM IST

Gossip Garrage : ఏపీలో వైసీపీ పార్టీ విచిత్ర పరిస్థితిని ఫేస్ చేస్తుంది. తొమ్మిదేళ్లు అపోజిషన్‌లో.. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చూడని క్లిష్టమైన సిచ్యువేషన్‌లో పడిపోయింది. అందివచ్చిన అవకాశాలను వాడుకోవడంలో ఆ పార్టీ విఫలం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. సంక్షోభాలను ఆయుధంగా మార్చుకోవాల్సిన అపోజిషన్‌ పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో ఉందంటున్నారు. అధినేత జగన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు.. మండల గ్రామ స్థాయి నాయకులు పార్టీ క్యాడర్ అంతా అయోమయంలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు నేతలు మీడియా ముందు అడపాదడపా మాట్లాడటం తప్ప.. ప్రభుత్వ విధానాల మీద ప్రజలతో కలిసి పోరాటం చేయడంలో సక్సెస్ కావడం లేదంటున్నారు. ఈ మధ్యే మూడు అంశాలపై నిరసనలకు పిలుపునిచ్చినా పెద్దగా విజయవంతం కాలేదు. అధినేత ఆదేశాలు ఇచ్చినా నేతలెవరూ పార్టీ యాక్టివిటీలో పాల్గొనడం లేదట.

కిందిస్థాయి నేతలకు భరోసా ఇచ్చే నాథుడే లేడా..!

ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇంకా కొందరు నేతలు లైన్‌లో ఉన్నారు. పార్టీలో కొనసాగుతున్న నేతలు మౌనంగా ఉండిపోతున్నారు. అయితే హైదరాబాద్‌ లేకపోతే బెంగళూరు, చెన్నైకి మకాం మార్చేశారు. కొందరు నేతలు అయితే విదేశీ పర్యటనల్లో ఉన్నారు. దీంతో క్యాడర్‌కు, కిందిస్థాయి నేతలకు భరోసా ఇచ్చే నాథుడే లేడట. కష్టం వస్తే చెప్పుకుందామంటే ఎవరూ అందుబాటులో ఉండటం లేదని.. వాపోతున్నారట కార్యకర్తలు, నేతలు. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితిని తెలుసుకుని చక్కదిద్దాల్సిన అధినేత కూడా నిరసనలకు పిలుపునివ్వడం తప్ప క్యాడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది.

YS Jagan: గర్వపడేలా చేశావు.. చిన్న కుమార్తెను అభినందిస్తూ వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

గత అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రతీ ఏటా భోగీ రోజు అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కాగితాలను భోగీ మంటలలో వేసి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేవారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకసారి..పెరిగిన విద్యుత్ బిల్లులను మరోసారి ..నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఇంకోసారి..ఇలా ఏదో ఒక నిరసనతో లైమ్‌లైట్‌లో ఉంటూ వచ్చింది టీడీపీ. మరి వైసీపీకి ఇలాంటి ఇష్యూసే దొరకలేదా అన్న చర్చ సాగుతోంది. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది అతి పెద్ద అంశంగా ఉంది. సీపీఎం ఈ ఇష్యూ మీద భోగీ మంటలలో ప్రైవేట్ పత్రాలను వేసి ఆందోళన చేపట్టింది. అలా ధరల పెరుగుదలపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం ఏ చిన్న ఆందోళన కూడా చేయకుండా ఉండిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ఫిబ్రవరి నుంచి జనంలోకి రావాలని అనుకుంటున్నారు. ఆయన వస్తారులే అన్నీ చూసుకుంటారులే అని ఫ్యాన్ పార్టీ ఉందంటున్నారు. జగన్ ఇప్పుడు లండన్ టూర్‌కు వెళ్తున్నారు. ఆయన ఈ నెలాఖరు దాకా తిరిగి రారు. అంతవరకూ ఇదే రకమైన సైలెన్స్ అయితే వైసీపీలో కంటిన్యూ అవుతుందనే అంటున్నారు.

అయోమ‌యంలో క్యాడ‌ర్‌..!

పార్టీ నేతలు కూడా ఏ యాక్టివిటీ చేయకుండా లైట్‌ తీసుకుంటుండంతో క్యాడర్ అయోమయంలో పడిపోయిందట. ప్రజా సమస్యల మీద ఆందోళన చేయడానికి నేతలు ముందుకు రాకపోవడంతో తమ పాలన బాగుందని కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారమే హైలెట్‌ అవుతుందని వైసీపీ కార్యకర్తలు నిట్టూర్పుతో ఉన్నారట. ఇక నేను మారాను..నేనేమిటో తెలుసుకున్నాను..ఇక నుంచి గ్యాపులు రాకుండా చూసుకుంటానని జ‌గ‌న్ నేతలకు హామీ ఇస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన తర్వాత నాయ‌కుల జంపింగ్‌..పార్టీ బలహీనతకు దారి తీస్తోందన్న సంకేతాలతో జ‌గ‌న్ అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది.

Special Trains: ముగిసిన సంక్రాంతి సందడి.. ప్రయాణికుల కోసం విశాఖ – చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

అధినేత నెత్తినోరు బాదుకుంటున్న వైసీపీ నాయ‌కులు మౌనం వీడడం లేదట. గ‌తంలో మాదిరిగా ఇప్పుడు ఎవ‌రూ పెద్దగా స్పందించ‌డం లేదన్న చర్చ జరుగుతోంది. గ‌తంలో ఎక్కడ ఎలాంటి ఘ‌ట‌న జ‌రిగినా..అంతో ఇంతో స్పందించేవారు. మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసేవారు. కానీ తిరుపతి ఘటనకు ముందే నేతలంతా సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ వాయిస్‌ గళంగా వినిపించే పేర్నినాని వంటి నేత..బియ్యం స్కామ్‌లు అంటూ ఆరోపణలు రావడంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఇక మరో నేత అంబటి రాంబాబు తనను స‌త్తెన‌ప‌ల్లిలో ఇంచార్జ్‌గా త‌ప్పించ‌డంపై అల‌క‌బూనారట. దీంతో వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించేవారు క‌రువ‌య్యారు.

అధినేత‌పై ఉన్న కోపంతోనే నేతలు మీడియా ముందుకు రావడం లేదా.? లేక అధికారంలో ఉన్నప్పుడు చేసిన దందాలపై ప్రభుత్వం కేసులు పెడుతుందన్న భయంలో ఉన్నారా అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. ఇప్పటికైనా వైసీపీ అధినేత, నేతల తీరులో మార్పు వస్తుందా.? ప్రజా ఉద్యమాలతో ఫ్యాన్‌ పార్టీ తిరిగి పుంజుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.