Special Trains: ముగిసిన సంక్రాంతి సందడి.. ప్రయాణికుల కోసం విశాఖ – చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండగ ముగియడంతో ఏపీలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వచ్చేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

Visakha - Charlapalli special trains
Special Trains: సంక్రాంతి పండుగ వేడుకలు ముగిశాయి. పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్లిన నగర వాసులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. దీంతో బుధ, గురువారాల్లో సుమారు 95వేల వాహనాలు నగరంలోకి వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు వాహనాలను పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే భారీ సంఖ్యలో వాహనాలు విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపైకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు రైళ్లలోనూ రద్దీ నెలకొంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ వచ్చే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఏపీలోని పలు జిల్లాల ప్రజలు రైల్వే సదుపాయం ఉండటంతో హైదరాబాద్ రావడానికి రైల్వేను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో సంక్రాంతి పండగ ముగియడంతో ఏపీలోని అనేక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వచ్చేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైళ్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు 18, 19 తేదీల్లో విశాఖపట్టణం నుంచి చర్లపల్లి వరకు నడవనున్నాయి.
విశాఖ -చర్లపల్లి -భువనేశ్వర్ రైలు.. 18వ తేదీన రాత్రి 7.45 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. 19వ తేదీ ఉదయం 7గంటలకు చర్లపల్లికి చేరుతుంది. 19వ తేదీ ఉదయం 9గంటలకు చర్లపల్లిలో బయలుదేరి సాయంత్రం 7.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 7.50 గంటలకు బయలుదేరి 20వ తేదీ తెల్లవారు జామున 2.15 గంటలకు భవనేశ్వర్ చేరుతుంది.
విశాఖ – చర్లపల్లి – విశాఖ రైలు .. 18వ తేదీ సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. 19వ తేదీ ఉదయం 8గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 19వ తేదీ ఉధయం 10గంటలకు చర్లపల్లిలో బయలుదేరి రాత్రి 10గంటలకు విశాఖకు చేరుకుంటుంది.
విశాఖ – చర్లపల్లి – విశాఖ రైలు.. 19వ తేదీ సాయంత్రం 6.20గంటలకు విశాఖలో బయలుదేరి 20వ తేదీ ఉదయం 8గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 20వ తేదీ ఉదయం 10గంటలకు చర్లపల్లిలో బయలుదేరి రాత్రి 10గంటలకు విశాఖ చేరుకుంటుంది.