Maha Cement: రానున్న రోజుల్లో మహా సిమెంట్‌కి మహర్దశ, అమరావతిలోనూ మై హోమ్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్- మహా సిమెంట్ డైరెక్టర్ సాంబశివరావు
12 రాష్ట్రాల్లో మహా సిమెంట్ సేల్స్ జరుగుతున్నాయన్నారు. మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామన్నారు.

Maha Cement: 27 ఏళ్లలో మహా సిమెంట్ స్టెప్ బై స్టెప్ ఎదిగిందని మహా సిమెంట్ డైరెక్టర్ సాంబశివరావు తెలిపారు. 0.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయి నుండి నేడు 12 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకుందన్నారు.
రాబోయే ఐదేళ్లలో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకోవాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు.
కంపెనీ అభివృద్ధిలో డీలర్స్ సహాయ సహకారాలు చాలా కీలకమైనవని సాంబశివరావు చెప్పారు. హైదరాబాద్ తో పాటు అమరావతిలోనూ అతి పెద్ద భవనాలు మహా సిమెంట్ తో కట్టారని ఆయన తెలిపారు. 12 రాష్ట్రాల్లో మహా సిమెంట్ సేల్స్ జరుగుతున్నాయన్నారు.
మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామన్నారు.
మహా సిమెంట్ కి 8 వేల మంది డీలర్స్, 350 మంది మార్కెటింగ్ నెట్వర్క్..
మహా సిమెంట్ కి 8 వేల మంది డీలర్స్, 350 మంది మార్కెటింగ్ నెట్వర్క్ ఉందని వెల్లడించారు. రానున్న రోజుల్లో మహా సిమెంట్ కి మహర్దశ రాబోతోందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి ఫాస్ట్ గా అభివృద్ధి జరుగుతోందని, అధికంగా సిమెంట్ వినియోగం ఉంటుందని సాంబశివరావు తెలిపారు.
అమరావతి ప్రాంతంలోనూ మై హోమ్ కన్ స్ట్రక్షన్ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సౌత్ ఇండియాలో లీడింగ్ సిమెంట్ బ్రాండ్ గా ఉన్న మహా సిమెంట్ విజయవాడ నోవాటెల్ లో యాన్యువల్ డీలర్స్ మీట్ గ్రాండ్ గా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో డీలర్లు హాజరయ్యారు. సంస్థ ఉన్నతికి తోడ్పడుతున్న డీలర్లను ఈ సందర్భంగా మహా సిమెంట్ ఘనంగా సన్మానించింది.
దిగ్గజ సిమెంట్ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన మహా సిమెంట్ విజయవాడలో రాష్ట్ర స్థాయి యాన్యువల్ డీలర్స్ మీట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించింది.
విజయవాడ నోవాటెల్ లో మహా కుటుంబం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహా సిమెంట్ డైరెక్టర్ సాంబశివరావుతో పాటు రీజనల్ మేనేజర్లు, డీలర్లు పాల్గొన్నారు.
ఏపీ వ్యాప్తంగా ఉన్న మహా సిమెంట్ డీలర్స్ ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరయ్యారు. ఏపీలో రీజనల్ వారీగా సేల్స్ లో చక్కని ప్రతిభ కనబరిచిన బెస్ట్ డీలర్స్ ను ఘనంగా సత్కరించి అవార్డులతో పాటు బహుమతులను ప్రదానం చేసింది మహా సిమెంట్.
మై హోమ్ గ్రూప్ నకు చెందిన మహా సిమెంట్ అనతి కాలంలో శర వేగంగా వృద్ధి చెందుతూ నిర్మాణ సంస్థలతో పాటు ప్రజల మన్ననలు సంపాదించింది.
1998లో ప్రారంభమైన ఈ సంస్థ గత 27 ఏళ్లలో ఉత్పత్తిని గణనీయంగా పెంచుకుంది. సంస్థ వృద్ధికి డీలర్స్ అందించిన సహకారమే దీనికి కారణమని మహా సిమెంట్ డైరెక్టర్ సాంబశివరావు తెలిపారు.
సౌత్ ఇండియాలో లీడింగ్ సిమెంట్ బ్రాండ్ గా ఉన్న మహా సిమెంట్ రాబోయే కాలంలో విస్తరణపై ఫోకస్ చేస్తున్నట్లు ప్రకటించింది.