Andhra Pradesh : రేపే పెళ్లి, శుభలేఖలు పంచటానికి వెళ్లి వరుడు అదృశ్యం .. ఆందోళనలో కుటుంబం

Tirupati Groom missing
Groom missing In Tirupati : తెల్లారితే పెళ్లి..బంధువులు, స్నేహితులు,శ్రేయోభిలాషులు అందరు వచ్చారు. ఇల్లు బంధువులతోను..పెళ్లి ఏర్పాట్లతోను కళకళలాడిపోతోంది. ఇంతలోనే జరగరానిది జరిగిపోయింది. పెళ్లి కొడుకు కనిపించుకుండాపోయాడు. దీంతో కుటుంబం తెగ ఆందోళనపడిపోయింది. తెలిసివారిని తెలియనివారిని కూడా అడిగింది. అన్నిచోట్లా వెదికింది. కానీ పెళ్లికొడుకు జాడ లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. తెల్లారితో వధువు మెడలో మూడుముళ్లు వేయాల్సిన వరుడు కనిపించకుండాపోవటంతో ఇటు వరుడు కుటుంబం..అటు వధువు కుటుంబం ఆందోళన చెందారు. పోలీసులను ఆశ్రయించారు.
చిత్తూరు జిల్లా ఎరుకలపురం గ్రామంలో తెల్లారితే పెళ్లి అనగా వరుడు కనిపించకుండాపోవటం కలకలం రేపింది. జూన్ 29 అంటే రేపు నవీన్ అనే యువకుడు వివాహం తిరుపతిలో జరగాల్సి ఉంది.ఇంతలోనే నవీన్ కనిపించకుండాపోయాడు. శుభలేఖలు పంచటానికి జూన్ 22న ఇంటినుంచి బయలుదేరి వెళ్లిన నవీన్ తిరిగి రాలేదు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ కోసం వెతుకుతున్నారు. మరి నవీన్ కనిపించకుండాపోవటానికి కారణమేంటి?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.