గుజరాత్ టు కృష్ణా : రిసెప్షన్ కు హెలికాప్టర్ లో వచ్చిన బిజినెస్ మెన్

gujarat industrialist arrives private helicopter : తన మేనల్లుడు వివాహం జరుగుతోంది.. ఈ సందర్భంగా నిర్వహించే రిసెప్షన్ లో నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు రావాలని గుజరాత్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తకు సూచించారు బిజినెస్ పార్టనర్. దీంతో రిసెప్షన్ వేడుకకు హాజరయ్యేందుకు గుజరాత్ రాష్ట్రం నుంచి కృష్ణా జిల్లాకు హెలికాప్టర్ లో తన కుటుంబంతో సహ వచ్చారు. ఊళ్లో..హెలికాప్టర్ ల్యాండ్ అవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. నూతన వధూవరులను ఆ పారిశ్రామిక వేత్త ఆశీర్వదించారు.
వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా మారుమూల పర్రచివర గ్రామంలో బొండాడ రాఘవేంద్రరావు నివాసం ఉంటున్నారు. ఈయన.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన కేపీ గ్రూప్ సీఎండీ ఫరూక్ జి.పటేల్ కు పార్ట్ నర్. బొండాడ రాఘవేంద్ర రావు మేనల్లుడు సందీప్ – శరణ్యల వివాహం జరిగింది. ఈ సందర్భంగా…పర్రచివర గ్రామంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరు కావాలని…ఫరూక్ ను బొండాడ కోరారు. ఫరూక్ తన కుటుంబసభ్యులతో గుజరాత్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పర్రచివర గ్రామానికి చేరుకున్నారు. ముందుగానే..నిర్ణయించిన ప్లేస్ లో ల్యాండ్ అయిన..హెలికాప్టర్ ను చూసేందుకు జనాలు తరలివచ్చారు. అక్కడి నుంచి..వేడుక జరిగే ప్రాంతానికి చేరుకున్న ఫరూక్ కుటుంబం..నూతన వధూవరులను ఆశీర్వదించారు.