Chandrababu : చంద్రబాబును వెంటాడుతున్న పలు కేసులు.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో కస్టడీ, బెయిల్ పిటిషన్ల విచారణ రేపటికి వాయిదా
చిత్తూరులో చంద్రబాబుపై అంగళ్ల అల్లర్ల కేసు నమోదు అయింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Chandrababu custody and bail petitions
Chandrababu Petitions Hearing Postponed : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మెడకు పలు కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ల విచారణ రేపటికి (బుధవారం) వాయిదా పడింది. బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసులపై విచారణ జరుగనుంది. దీంతోపాటు చంద్రబాబుపై ఇంకా మూడు కేసులు ఉన్నాయి. వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్ జారీ చేసింది.
అలాగే చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారణకు రాలేదు. అంతేకాకుండా ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా ఇంకా విచారణ ప్రారంభం కాలేదు.
Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. రేపు విచారణ
చిత్తూరులో చంద్రబాబుపై అంగళ్ల అల్లర్ల కేసు నమోదు అయింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ ను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.