AndhraPradesh : ఏపీలోని ఈ ప్రాంతాల్లో హైఅలర్ట్.. 50మంది మావోయిస్టులు అరెస్ట్… వివరాలు వెల్లడించిన పోలీసు అధికారులు.. భారీగా పోలీసు బలగాలు

AndhraPradesh ఏపీలో పట్టుబడిన 50 మంది మావోయిస్టులను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ కు పోలీసులు తరలించారు. భారీ భద్రత నడుమ మావోయిస్టులను

AndhraPradesh : ఏపీలోని ఈ ప్రాంతాల్లో హైఅలర్ట్.. 50మంది మావోయిస్టులు అరెస్ట్… వివరాలు వెల్లడించిన పోలీసు అధికారులు.. భారీగా పోలీసు బలగాలు

Updated On : November 19, 2025 / 9:08 AM IST

Andhra : దేశంలో మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర హోంశాఖ పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుంది. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో కొందరు అరణ్యం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తుండగా.. మరికొందరు పోలీసుల ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా మంగళవారం ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న మోస్ట్‌వాంటెడ్ హిడ్మా హతమయ్యాడు. అతని భార్య హేమ అలియాస్ రాజే, మరో నలుగురు కూడా ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో ఉన్నారు. ఇదే సమయంలో ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టు పర్వం కొనసాగింది.

ఏపీలో ఒకేరోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. హిడ్మా ఎన్ కౌంటర్ జరిగిన రోజు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో 28 మంది మావోయిస్టులు, కాకినాడలో ఇద్దరు, ఏలూరు జిల్లాలోని ఏలూరు గ్రీన్ సిటీలో 15మంది, విజయవాడ రామవరప్పాడు ప్రాంతంలో నలుగురు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఒకరు.. ఇలా మొత్తం 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: Annadata sukhibhava : ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ సొమ్ము వచ్చేది నేడే.. డబ్బులు పడనివారు వెంటనే ఇలా చేయండి..

ఏపీలో పట్టుబడిన 50 మంది మావోయిస్టులను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ కు పోలీసులు తరలించారు. భారీ భద్రత నడుమ మావోయిస్టులను ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్లు, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్స్‌, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను స్వాధీనం చేసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా.. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఏపీలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది.

మావోయిస్టుల అరెస్టులపై మీడియా సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించనున్నారు. ఇక్కడ చూడండి.