ముహూర్తం ఫిక్స్ : జనవరి 20నాటికి పలు శాఖలు విశాఖకు తరలింపు
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖ తరలించే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోందా.. జనవరి 20నాటికి కొన్ని శాఖలను వైజాగ్‍కు తరలిస్తారా... అంటే అవుననే సమాధానం

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖ తరలించే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోందా.. జనవరి 20నాటికి కొన్ని శాఖలను వైజాగ్‍కు తరలిస్తారా… అంటే అవుననే సమాధానం
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖ తరలించే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోందా.. జనవరి 20నాటికి కొన్ని శాఖలను వైజాగ్‍కు తరలిస్తారా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ… రెండో సమావేశంలో ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు సూచించినట్లు తెలుస్తోంది. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలపైనే ఫోకస్ చేసిన హైపవర్ కమిటి.. జనవరి 13న మరోసారి భేటీ కానుంది.
విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రెండోసారి భేటీ అయిన హైపవర్ కమిటీ… రాజధాని ప్రాంత రైతులు, జిల్లాలు, ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై చర్చించింది. కేవలం పరిపాలనే కాదు..అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలన్న అంశంపై దృష్టి పెట్టింది. బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలే కాకుండా అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించినట్లు కమిటీ సభ్యులు, మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని హైపవర్ కమిటీ నిర్ణయించింది. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను ప్రభుత్వం పరిగనలోకి తీసుకోవడమే కాకుండా… కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ భావించింది.
పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలపైనే హైపవర్ కమిటీ ఫోకస్ చేసింది. రాజధానిని తరలింపుతో ఎక్కువ ప్రభావం పడే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై వచ్చిన ప్రతిపాదనలపైనా దృష్టిపెట్టిన కమిటీ… ఈ అంశాలపై లోతుగా చర్చించింది. 13 జిల్లాలు సమాంతరంగా, సమానంగా అభివృద్ధి జరగాలన్నదే తమ ఉద్దేశమని, ఆ దిశగా వచ్చే అన్ని ప్రతిపాదనలను పరిశీలించినట్లు కమిటీ సభ్యులు చెప్పారు.
ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్ట్ రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా ఉండటంతో… హైపవర్ కమిటీ రిపోర్ట్ కూడా రాజధాని వికేంద్రీకరణకు సానుకూలంగా ఉండే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో… విశాఖకు వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి అసంతృప్తిని తగ్గించడం కోసం జగన్ సర్కారుకు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హైపవర్ కమిటీ భేటీలో కూడా… ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అమరావతి నుంచి విశాఖకు తరలి వచ్చే ఉద్యోగులకు.. విశాఖలో 25 లక్షలకే ఇంటి స్థలం కేటాయించాలని హై పవర్ కమిటి కీలక ప్రతిపాదన చేసింది. భార్య లేదా భర్త ఉద్యోగి అయితే.. డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలతో సంబంధం లేకుండా విశాఖకు బదిలీ చేయాలని సూచించింది. హెచ్ఆర్ఏ 30 శాతం, సీసీఏ 10 శాతం.. ఇంటి సామాన్ల తరలింపు కోసం నగదు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఇక… రాజధాని అంశంపై ఏర్పాటైన హైపవర్ కమిటీ… జనవరి 13న మరోసారి సమావేశం కానుంది. ఆ సమావేశంలో రైతులు, ఉద్యోగులతోపాటు భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకోనుంది.
* హైపవర్ కమిటి రెండో సమావేశంలో కీలక ప్రతిపాదనలు
* అమరావతి నుంచి విశాఖకు తరలి వచ్చే ఉద్యోగులకు రూ.25 లక్షలకే ఇంటి స్థలం
* భాగస్వామి ఉద్యోగి అయితే డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలతో సంబంధం లేకుండా విశాఖకు బదిలీ
* హెచ్ఆర్ఏ 30 శాతం, సీసీఏ 10 శాతం, ఇంటి సామాన్ల తరలింపు కోసం నగదు
* కుటుంబంతో సహా తరలివస్తే నెలకు రూ.4 వేల చొప్పున రాయితీ అద్దె
* రాజధాని ప్రాంత రైతులు, జిల్లాలు, ప్రాంతాలవారీ అభివృద్ధిపై చర్చ
* పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హైపవర్ కమిటీ దృష్టి
* బీసీజీ, జీఎన్ రావు కమిటి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన హైపవర్ కమిటీ
* కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని నిర్ణయం
* పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలపై ఫోకస్
* 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని అభిప్రాయపడిన కమిటీ
* జనవరి 13న మరోసారి హైపవర్ కమిటీ సమావేశం