అమరావతిలో టెన్షన్ టెన్షన్ : సీఎం జగన్ కు భారీ భద్రత

ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 02:28 AM IST
అమరావతిలో టెన్షన్ టెన్షన్ : సీఎం జగన్ కు భారీ భద్రత

Updated On : January 20, 2020 / 2:28 AM IST

ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ముందుగా కేబినెట్ భేటీ కానుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. దీంతో రాజదాని ప్రాంతంలో ఉద్రిక్త వాతారణం నెలకొంది.

ama

 

2వేల 500 మంది పోలీసులతో పహారా:

అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతం పోలీసుల భద్రతా వలయంలో ఉంది. నగరంలో 2వేల 500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

jagan

 

అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు:

అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 13 జిల్లాల్లో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ, జేఏసీ నేతలను గృహ నిర్భందం చేస్తున్నారు. టీడీపీ నేతల నివాసాల దగ్గర పోలీసుల మోహరించారు. అసెంబ్లీ చుట్టూ మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. 30 యాక్ట్ అమలు అమలు చేశారు. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజధాని పేరెత్తకుండానే ప్లాన్ అమలు:
ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ్టి నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు… రాష్ట్రంలో మూడు రాజధానులు… అభివృద్ధి వికేంద్రీకరణ… సీఆర్డీఏ చట్టంలో మార్పు లాంటి కీలక నిర్ణయాలకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఈ నిర్ణయాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విభేదిస్తుండటంతో సమావేశాలు గతంలో కంటే వాడీవేడిగా జరిగే అవకాశముంది.

* అమరావతిలో టెన్షన్..టెన్షన్.. 
* అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో హైఅలర్ట్
* పోలీసుల భద్రతా వలయంలో అమరావతి
* నగరంలో 2వేల 500 మంది పోలీసులతో పహారా
* రాజధాని గ్రామాల్లో ఉధృతమైన రైతుల ఆందోళనలు
* సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
* సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు భారీ బందోబస్తు

* నేడు అసెంబ్లీ ముట్టడికి అమరావతికి జేఏసీ పిలుపు
* జిల్లాల్లో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు
* కొనసాగుతున్న టీడీపీ, జేఏసీ నేతల హౌస్ అరెస్టులు
* టీడీపీ నేతల నివాసాల దగ్గర పోలీసుల మోహరింపు
* అసెంబ్లీ చుట్టూ మూడంచెల పోలీస్ భద్రత
* అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు

* అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు
* ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేత
* అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు సిబ్బందికి మాత్రమే అనుమతి