Anantapur : జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్ధం.. అవసరమైతే సీఎంను కలుస్తాం
జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అవసరమైతే సీఎం జగన్ ను కలుస్తామన్నారు. జిల్లాకు ప్రశాంత నిలయం పేరు పెట్టుకోవచ్చని, అయితే తమ డిమాండ్ మాత్రం...

Hindupur
Hindupur MLA Balakrishna : హిందూపురాన్ని సత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మరోసారి డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయన అఖిలపక్ష నేతలతో కలిసి అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అవసరమైతే సీఎం జగన్ ను కలుస్తామన్నారు. జిల్లాకు ప్రశాంత నిలయం పేరు పెట్టుకోవచ్చని, అయితే తమ డిమాండ్ మాత్రం నెరవేర్చాలని కోరారు. వినతిపత్రాలు ఇచ్చిన తర్వాత..వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని, తర్వాతే..తమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయడానికి ప్రజలకే ఇష్టం లేదన్నారు.
Read More : Chiranjeevi : పొద్దున్న షూటింగ్.. రాత్రికి డబ్బింగ్.. స్పీడ్ పెంచిన మెగాస్టార్..
హిందూపురంలోని అన్ని సౌకర్యాలున్నాయని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయంలో తాము ఉద్యమానికి ముందుకు తీసుకెళుతామని, ఎంతదూరమైనా వెళుతామన్నారు. వైసీపీ మెనిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రస్తావించారని, రాజీనామా విషయంలో కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం ఏపీలో అందరూ ఉద్యమిస్తున్నారని, ప్రజల దృష్టి మళ్లించడానికి జిల్లాల ప్రకటన చేశారని విమర్శించారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టారో అందరికీ తెలిసిందేన్నారు. నిజమైన ప్రేమతో ప్రభుత్వం వ్యవహరించడం లేదని, గత ప్రభుత్వం చేసిన వాటిని నిర్వీర్యం చేశారన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంపై ఏమి మాట్లాడడం లేదని, కుర్చీలో కూర్చొంటే అంతేనని తెలిపారు.
Read More : Statue of Equality : హైదరాబాద్ పర్యటనపై మోడీ ట్వీట్
రాష్ట్రంలో ఏమి జరుగుతోంది ? ప్రజల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులకు అధికారాలు లేవని, అడ్మినిస్ట్రేటివ్ విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తోందని, ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందన్నారు. సినిమా టికెట్ల వివాదంపై ఆయన స్పందించారు. ఇప్పటికే సినీ పెద్దలకు తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ విసిరిన సవాలుకు ఓకే చెప్పారు. హిందూపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఎవరితోనైనా కలసి పని చేస్తామని, ఎక్కడ ఉన్నా తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎంత త్వరగా ప్రభుత్వం దిగిపోతుందోనని ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు.