MLC Duvvada Srinivas : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాకిచ్చిన పోలీసులు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు
MLC Duvvada Srinivas : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై గతేడాది మార్చి నెలలో సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు బిగ్ షాకిచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
MLC Duvvada Srinivas
- ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల నోటీసులు
- సోమవారం విచారణకు హాజరు కావాలని సూచన
- పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలే కారణం..
MLC Duvvada Srinivas : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై గతేడాది మార్చి నెలలో సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు బిగ్ షాకిచ్చారు. విచారణ నిమిత్తం హిరమండలం పోలీస్ స్టేషన్‌కు స్వయంగా హాజరుకావాలని ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Also Read : AP Weather Today : ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
హిరమండలం పోలీసులు దువ్వాడ శ్రీనివాస్‌కు ఈనెల 16న నోటీసులు జారీ చేశారు. 20వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, 22వ తేదీన విచారణకు హాజరవుతానని పోలీసులకు దువ్వాడ తెలిపారు. దీంతో 22న హిరమండలం పోలీస్ స్టేషన్‌కు స్వయంగా హాజరుకావాలని ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ నెలకు రూ.50 కోట్లు ప్యాకేజీ తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే పవన్ కల్యాణ్ అసెంబ్లీలో కనిపించలేదంటూ శాసనసభ సమావేశాల ముందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడుతూ రాష్ట్రంలోని పలుచోట్ల జనసేన నేతలు ఆయా పోలీస్ స్టేషన్లలో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదులు చేశారు. గుంటూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, అవనిగడ్డ, మచిలీపట్నం ఇలా అనేకచోట్ల దువ్వాడపై కేసులు నమోదయ్యయి. తాజాగా.. హిరమండలం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని దువ్వాడ శ్రీనివాస్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ దూషించారంటూ గతంలోనూ దువ్వాడపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. దీంతో దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ గతంలో టెక్కలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.ఇప్పుడు హిరమండలం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
