28ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు.. తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

28ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ..

28ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు.. తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

Thota Trimurthulu

Thota Trimurthulu : 28ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి, ఇద్దరికి శోరముండనం చేశారు. ఆ కేసులో తాజాగా విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు 18నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. త్రిమూర్తులకు జైలు శిక్షతో పాటు రూ. 2.50లక్షల జరిమానాను కోర్టు విధించింది. ప్రస్తుతం ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Also Read : హైద‌రాబాద్‌లో లారీ బీభ‌త్సం.. బైకును ఈడ్చుకెళ్లిన వైనం.. బైకర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

28 సంవత్సరాల క్రితం దళితులకు సంబంధించిన శిరోముండనం కేసు ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి దళితులకు న్యాయం జరగాలని వివిధ దశల్లో పోరాటాలు, నిరసనలు చేస్తూ వచ్చారు. అయితే, 28ఏళ్ల పాటు సాగిన కేసు విచారణ 148 సార్లు వాయిదా పడింది. తాజాగా విశాఖ కోర్టు ఈ కేసులో తుదితీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పు పట్ల దళిత, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.