హైద‌రాబాద్‌లో లారీ బీభ‌త్సం.. బైకును ఈడ్చుకెళ్లిన వైనం.. బైకర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

హైదరాబాద్ లో లారీ బీభత్సం సృష్టించింది. ఒవైసీ హాస్పిటల్ నుంచి ఎల్బీ నగర్ మార్గంలో వెళ్తున్న లారీ ఐఎస్ సదన్ పరిధిలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని..

హైద‌రాబాద్‌లో లారీ బీభ‌త్సం.. బైకును ఈడ్చుకెళ్లిన వైనం.. బైకర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

lorry hit motorcycle

Updated On : April 17, 2024 / 2:09 PM IST

Truck Hit Motorcycle In Hyderabad :  హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బైక్ ను ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. అయితే, బైక్ నడిపే వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. బైక్ రైడర్ లారీ డోర్ పట్టుకొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయినా, లారీ డ్రైవర్ ఆపకుండా కొన్ని కిలో మీటర్లు దూరం లారీని అలాగే తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలను వెనుకాల వాహనంపై ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో వైరల్ గా మారింది.  ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు తెలుస్తుండగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read : Cyber Crimes : పెండింగ్ చ‌లాన్లు చెల్లిస్తున్నారా..? ఈ విష‌యం తెలుసుకోండి

హైదరాబాద్ లో లారీ బీభత్సం సృష్టించింది. ఒవైసీ హాస్పిటల్ నుంచి ఎల్బీ నగర్ మార్గంలో వెళ్తున్న లారీ ఐఎస్ సదన్ పరిధిలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే, లారీ డ్రైవర్ ఆపకుండా లారీని పోనివ్వడంతో.. బైక్ నుసైతం కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. బైకర్ తెలివిగా లారీ డోర్ పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు.. అయితే, లారీ డ్రైవర్ పారిపోయే క్రమంలో లారీని ఆపడకుండా పోనివ్వడంతో… లారీ డోర్ కు వేలాడుతూ సుమారు కిలో మీటరు దూరం ప్రయాణించి బైకర్ ప్రాణాలు దక్కించుకున్నాడు.

Also Read : Crimes Against Women : దేశంలో మహిళలపై పెరిగిన నేరాలు…నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెబుతుందంటే…

లారీ బీభత్సం సృష్టించిన ఘటనకు సంబంధించిన వీడియోను రవికుమార్ అనే వ్యక్తి ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశాడు. డియర్ సర్.. ఈ సంఘటన చూడండి.. ఇది ఒవైసీ హాస్పిటల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ రూట్ వరకు జరిగింది. దయచేసి ఈ మార్గంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయండి అంటూ కోరాడు. ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీస్ వెంటనే స్పందించింది. మేము పరిశీలిస్తామని పేర్కొంది. లారీ బీభత్సంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.