Tollywood Mega Meeting: సీఎం జగన్ దగ్గరికి.. భారీ సినిమాల తరఫున ప్రతినిధులంతా వెళ్లినట్టే..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో.. టాలీవుడ్ పెద్దలు, ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు చర్చిస్తున్నారు.

Tollywood Mega Meeting: సీఎం జగన్ దగ్గరికి.. భారీ సినిమాల తరఫున ప్రతినిధులంతా వెళ్లినట్టే..!

Mega Team

Updated On : February 10, 2022 / 12:14 PM IST

Tollywood Mega Meeting: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో.. టాలీవుడ్ పెద్దలు, ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు చర్చిస్తున్నారు. సినిమా టికెట్ల ధరల నుంచి మొదలు పెట్టి.. చిన్న సినిమాలకు ప్రత్యేక షో అనుమతి వరకూ.. ప్రతి విషయాన్ని జగన్ తో చర్చిస్తున్నారు. ఇందులో.. మెగాస్టార్ చిరంజీవి వెంట.. అగ్ర హీరోలు ప్రభాస్, మహేష్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ.. మరింత మంది ప్రముఖులు హాజరయ్యారు. తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇక్కడి వరకూ కామన్ పాయింటే కానీ.. ఇంటర్నల్ గా ఓ విషయం.. అందరినీ ఆకర్షిస్తోంది. అదే.. టాలీవుడ్ ను దాటి.. కామన్ పబ్లిక్ లోనూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ను క్రియేట్ చేసింది.

ఇంతకీ.. ఆ ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పుడు టాలీవుడ్ లో వరుసపెట్టి భారీ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అందులో.. మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీస్ అయిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ తో పాటు.. దేశ వ్యాప్తంగా క్యూరియాసిటీ కలిగిస్తున్న ఆచార్య, భీమ్లానాయక్, సర్కారు వారి పాట సినిమాలు ఉన్నాయి. కొంత కాలంగా సినిమా టికెట్ ధరల వివాదంతో పాటు.. కరోనా ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ కారణంగా.. కొన్ని సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడింది. మరి కొన్ని సినిమాలైతే.. విడుదల కూడా వాయిదా వేసుకున్నాయి.

ఈ 5 సినిమాలకు సంబంధించిన ప్రముఖులు.. ఇప్పుడు సీఎం జగన్ ను కలిసేందుకు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. అందులో.. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రాజమౌళి, రాధేశ్యామ్ కు సంబంధించి ప్రభాస్, ఆచార్యకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ, సర్కారు వారి పాటకు సంబంధించి మహేష్ బాబు, భీమ్లానాయక్ కు సంబంధించి పవన్ త్రివిక్రమ్ వంటి వారెవరూ లేకున్నా.. పవన్ అన్నయ్య చిరంజీవి ఉన్నారు. ఈ లెక్కన.. బడా సినిమాలకు సంబంధించిన వారంతా.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. సీఎంతో భేటీలో పాలు పంచుకుంటున్నట్టే లెక్క.. అని జనాలు అనుకుంటున్నారు.

మరోవైపు.. ఆర్. నారాయణమూర్తి, అలీ, నిర్మాత నిరంజన్ రెడ్డి వంటి మరింత మంది ప్రముఖులు కూడా ఈ చర్చల్లో భాగం పంచుకుంటున్నారు. చిన్న సినిమాల తరఫున నారాయణమూర్తి మాట్లాడే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు.

Read More:

Tollywood Mega Meeting: బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం వెళ్లిన సినీ పెద్దలు వీళ్లే..!

Tollywood: టాలీవుడ్ ప్రముఖుల కోసం.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు

Tollywood : చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్ కూడా.. జగన్‌ని కలవడానికి వెళ్తున్న స్టార్స్