ISRO Chairman : ఆధిత్య ఎల్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. దేవాలయం‌లో ఛైర్మన్ సోమనాథ్ పూజలు

చంద్రయాన్ -3 విజయంతో చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రష్యాలను శోధించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆధిత్య ఎల్ -1 ప్రయోగాన్ని చేపట్టబోతుంది.

ISRO Chairman : ఆధిత్య ఎల్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. దేవాలయం‌లో ఛైర్మన్ సోమనాథ్ పూజలు

PSLV-C57/Aditya-L1 Mission

Updated On : September 1, 2023 / 12:02 PM IST

ISRO Chairman DR Somanath: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట‌లోని శ్రీ చెంగాలమ్మ దేవాలయం‌లో ఇస్రో ఛైర్మన్ డి.ఆర్. సోమనాథ్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్యా L1 రాకెట్ ప్రయోగం విజయవంతంకోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ.. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 11.50 గంటలకు PSLV.C57 రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుని వద్దకు ఆదిత్యా L1 ఉపగ్రహంను పంపుతామని చెప్పారు. PSLV.C57 రాకెట్ ప్రయోగానికి 24 గంటల కౌంట్ డౌన్ ఉంటుందని అన్నారు. PSLVC-57 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని చెప్పారు.

Aditya-L1: సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు కౌంట్‌డౌన్ షురూ

చంద్రయాన్-3కి సంబంధించిన లాండర్, రోవర్‌లు చంద్రునిపై విజయవంతం‌గా పని చేస్తున్నాయని ఇస్రో చైర్మన్ అన్నారు. అక్టోబర్ మొదటి, రెండవ వారంలో గగన్‌యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని చెప్పారు.GSLV mk.2 ద్వారా INSAT.3Ds రాకెట్ ప్రయోగం చేపడుతామని అన్నారు.తదుపరి మాసంలో SSLV రాకెట్ ప్రయోగం చేపడుతామని ఇస్రో చైర్మన్ సోమనాధ్ తెలిపారు.

ISRO : సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో సిద్ధం..

చంద్రయాన్ -3 విజయంతో చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆధిత్య ఎల్ -1 ప్రయోగాన్ని చేపట్టబోతుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీ చెంగాలమ్మ దేవాలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ప్రయోగం విజయవంతం కోరుతూ ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అధిత్యా నమూనాకు పూజలు నిర్వహించారు.