జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా

Jagananna Vidya Kanuka : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ‘Jagananna Vidya Kanuka’ ఒకటి. విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకం రూపొందించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే..ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడింది.
స్టాక్ పాయింట్ లో ఉన్న జగనన్న విద్యా కానుకలను ప్రధానోపాధ్యాయులకు అందచేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం సీఎంవో ప్రకటించింది. విద్యా కానుక కిట్లను ప్రధానోపాధ్యాయులు సిద్ధం చేసుకోవాలని సూచించింది.
నవంబర్ 02వ తేదీన ఏపీలో స్కూల్స్ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు విద్యా కానుక కిట్ లు అందచేస్తామని సీఎం జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 02వ తేదీన పాఠశాలలు ప్రారంభమౌతున్న సందర్భంగా..విద్యా కానుక కిట్ లు ముందుగానే అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొత్తం రూ. 650 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
7 రకాల వస్తువులను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది.
జగనన్న విద్యా కానుక కింద 3 జతల దుస్తులు(వస్త్రం), బెల్టు, ఒక జత షూ,
రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు.
దుస్తులను పాఠశాలల పేరెంట్స్ కమిటీల ద్వారా విద్యార్థుల తల్లులకు పంపిణీ చేయిస్తారు.
ఒక్కో జతకు కుట్టుకూలి రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తుంది.