Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ను మోసం చేశారు- జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిపై సంచలన ఆరోపణలు

పవన్ ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వండి.

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ను మోసం చేశారు- జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిపై సంచలన ఆరోపణలు

Pawan Kalyan

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విశాఖపట్నం సౌత్ జనసేన నాయకులు బహిరంగ లేఖ రాశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణను మార్చి వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే మంచిదన్నారు. సౌత్ లో జనసేన గ్రాఫ్ పడిపోయిందన్నారు. గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధి నాయకుడికి విజ్ఞప్తి చేశారు జనసేన కార్పొరేటర్ సాదిక్. వంశీకృష్ణ తన ఎమ్మెల్సీ పదవిపై అనర్హత వేటుని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్లారని.. ఈ విషయం పవన్ కల్యాణ్ కి, ప్రజలకు తెలియదని ఆయన అన్నారు. వంశీకృష్ణలో గెలుస్తామనే నమ్మకం లేదని, అందుకే కోర్టుకి వెళ్లారని చెప్పారు.

మాగి శ్రీనివాస్, జనసేన నేత
విశాఖ సౌత్ నియోజకవర్గం భౌగోళిక స్వరూపం కూడా తెలియని వ్యక్తికి జనసేన పార్టీ టికెట్ కేటాయించింది. వంశీకృష్ణ.. జనసేన, పవన్ ను మోసం చేశారు. పవన్ ను బ్లాక్ మెయిల్ చేసి వంశీ టికెట్ తెచ్చుకున్నారు. ఎమ్మెల్సీగా కొనసాగడానికి వంశీ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓడిపోతే వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటారు. పవన్ ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వండి.

ఎమ్మెల్సీ వంశీ కృష్ణ వైసీపీని వీడి జనసేనలో చేరిన సంగతి తెలిసింది. వంశీ కృష్ణకు విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అయితే, వంశీకృష్ణకు జనసేన టికెట్ ఇవ్వడాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Also Read : దత్తపుత్రుడు అప్పుడేమో భార్యలను మార్చారు.. ఇప్పుడేమో వీటిని మార్చుతున్నారు: జగన్