జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు.. గుంటూరుకు తరలింపు

రాజధాని మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు.

జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు.. గుంటూరుకు తరలింపు

Journalist Krishnam Raju

Updated On : June 12, 2025 / 8:43 AM IST

Journalist Krishnam Raju arrested: రాజధాని మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లాలోని తగరపువలస వద్ద బుధవారం సాయంత్రం ఆయన్ను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం కృష్ణంరాజును మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఇప్పటికే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ లో ఉన్నారు.