KA Paul: నిర్భందంలో కేఏ పాల్ కాన్వాయ్.. డబ్బులివ్వాలంటూ డిమాండ్
కాకినాడలోని ఓ స్కూల్‌లో కేఏ పాల్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు స్కూల్ సిబ్బంది. పెద్ద మొత్తంలో తనకు తిరిగివ్వాల్సిన పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తేనే వదులుతామంటూ అడగడం గమనార్హం.

Ka Paul
KA Paul: కాకినాడలోని ఓ స్కూల్‌లో కేఏ పాల్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు స్కూల్ సిబ్బంది. పెద్ద మొత్తంలో తనకు తిరిగివ్వాల్సిన పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తేనే వదులుతామంటూ అడగడం గమనార్హం.
కాకినాడలోని ఓ హోటల్‌లో బుధవారం కేఏ పాల్ బస చేశారు. అదే సమయంలో పాల్‌కు సంబంధించిన కాన్వాయ్‌ను సీబీసీఎన్సీ కాంపౌండ్‌లో ఉంచుకోమని రత్నకుమార్ చెప్పారట. తెల్లారిన తర్వాత కాన్వాయ్ తీయబోయే సమయానికి పెద్ద మొత్తంలో డబ్బులివ్వాలని లేదంటే కాన్వాయ్ వదలమంటూ డిమాండ్ వినిపించారు.
దానికి తోడు స్కూల్ సిబ్బంది కూడా కార్లు వెళ్లకుండా అడ్డుకున్నారు. రత్నకుమార్ చెబితేనే కార్లను వదులుతామని చెప్తున్నారు. పాల్ సిబ్బంది కాన్వయ్ ను బయటకు తీసుకెళ్తామని చెప్తుంటే.. స్కూల్ సిబ్బంది అడ్డుకోవడంతో సీబీసీఎన్సీ స్కూల్ వద్ద హై డ్రామా నెలకొంది.
Read Also: హాట్ టాపిక్‌గా మారిన కేఏ పాల్, రూపాల భేటీ
ఫోన్ లో సంప్రదించాలని చూసినా రత్నకుమార్ అందుబాటులోకి రాకపోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.