కడపలో గ్యాంగ్ రేప్ కలకలం – నలుగురు అరెస్ట్

కడపలో గ్యాంగ్ రేప్ కలకలం – నలుగురు అరెస్ట్

Updated On : February 9, 2021 / 2:24 PM IST

kadapa: rowdy sheeter and 3 held for rape : కడప నగరంలో ఒక మహిళపై గ్యాంగ్ రేప్ చేసినఘటన ఆలస్యంగావెలుగు చూసింది. నగర శివారు ఇందిరా నగర్ కు చెందిన మఙిల(27) ఫిబ్రవరి 7 వతేదీన ఇంటినుంచి రిమ్స్ ఆస్పత్రికి వెళుతుండగా స్ధానిక రౌడీషీటర్ సతీష్ మరో ముగ్గురితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి ఊరి చివరికి తీసుకువెళ్లాడు.

అక్కడ నలుగురు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బాధిత మహిళ సీకేదిన్నె పోలీసు స్టేషన్ కు వెళ్లి తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ చార్జి సీఐ టీవీ సత్యనారాయణ తెలిపారు.