Kaikala Satyanarayana Death: రాజకీయాల్లోనూ కైకాలది ప్రత్యేక శైలి.. టీడీపీ నుంచి పార్లమెంట్‌కు
ఎన్టీఆర్‌తో కైకాల ఎంతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానంకు కైకాల సత్యనారాయణ పోటీ చేశారు. 1996లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివరావుపై 81వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Kaikala Satyanarayana Death
Kaikala Satyanarayana Death: టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా కైకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించడంతో ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో కన్నుమూశారు. కైకాల మరణంతో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోనూ రాణించారు. అయితే, ఒకసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఆయన, రెండోసారి ఓడిపోయారు. ఆ తరువాత కొద్దికాలానికే రాజకీయాల నుంచి వైదొలిగారు.
Kaikala Satyanarayana : ఎస్వీ రంగారావు తరువాత కైకాలే..
1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరంలో జన్మించిన కైకాల.. తన ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 750కిపైగా చిత్రాల్లో నటించారు. కైకాల మొదటి చిత్రం సిపాయి కూతురు, చివరి చిత్రం మహర్షి. కైకాలకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ సినీ నటుడు నందమూరి తారకరామారావుతో కలిసి కైకాల అత్యధిక సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రాలు 101 వరకు ఉన్నాయి. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించారు.
Kaikala Satyanarayana : సీనియర్ ఎన్టీఆర్ కోసం ఎన్నో సాహసాలు చేసిన కైకాల..
ఎన్టీఆర్‌తో కైకాల ఎంతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానంకు కైకాల సత్యనారాయణ పోటీ చేశారు. 1996లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివరావుపై 81వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తద్వారా 11వ లోక్‌సభలో అడుగు పెట్టారు. తన హయాంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అక్కడి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. 1998లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి కావూరిపై ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొద్దికాలానికే రాజకీయాల నుంచి కైకాల వైదొలిగారు.