Ex-Ap CM’s Wife: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి భార్య రాఘవమ్మ కన్నుమూశారు.

Kasu Brahmananda Reddy Wife Dies At 97 In Hyderabad
Kasu Brahmananda Reddy’s Wife: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి భార్య రాఘవమ్మ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో 97ఏళ్ల వయస్సులో ఆమె వృద్ధాప్య కారణాలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాఘవమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. రాఘవమ్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 1964నుంచి 1971 మధ్యకాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.