Riti Saha Case : విశాఖలో బెంగాల్ విద్యార్థిని రితి సాహ మృతి కేసులో కీలక పరిణామం

ఇప్పటికే ఈ కేసు పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. రితి సాహ మృతిపై సరైన వివరణ ఇవ్వలేకపోయారు విశాఖ పోలీసులు. Riti Saha Case Update

Riti Saha Case : విశాఖలో బెంగాల్ విద్యార్థిని రితి సాహ మృతి కేసులో కీలక పరిణామం

Riti Saha Case Update (Photo : Google)

Riti Saha Case Update : విశాఖలో వెస్ట్ బెంగాల్ విద్యార్థిని రితి సాహ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని రితి సాహ కేసు విశాఖ పోలీసుల మెడకు బిగుసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోర్త్ టౌన్ పోలీసులపై సీపీ త్రివిక్రమ వర్మ చర్యలు తీసుకున్నారు. ఫోర్త్ టౌన్ సిఐ శ్రీనివాసరావును వీఆర్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read..Murder For Biryani : ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

విద్యార్థిని మృతి కేసుపై సీపీ సీరియస్ అయ్యారు. ఇప్పటికే విద్యార్థిని మృతి కేసులో లంచం తీసుకున్నారని ఫోర్త్ టౌన్ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును కౌంటర్ ఇంటిలిజెన్స్ కు బదిలీ చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ కేసు పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. రితి సాహ మృతిపై సరైన వివరణ ఇవ్వలేకపోయారు విశాఖ పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఉన్నా ఆధారాలు స్పష్టంగా లేవంటున్నారు.

Also Read..Ananthapur : పోలీసులమని బెదిరించి రూ.2 కోట్లు దోచుకెళ్లిన హైవే దొంగలు, అనంతపురంలో ఘరానా మోసం

వెస్ట్ బెంగాల్ కు చెందిన రితి సాహ(16) టెన్త్ తర్వాత నీట్ లో శిక్షణ కోసం విశాఖలోని ఓ ఇన్ స్టిట్యూట్ లో చేరింది. మే 2022లో విశాఖ వచ్చింది. ఓ హాస్టల్ లో ఉంటూ నీట్ కు ప్రిపేర్ అవుతోంది. చివరిసారి రితి సాహ తన తండ్రితో జూలై 14న మాట్లాడింది. అదే రోజు అర్ధరాత్రి రితి సాహ తండ్రికి ఫోన్ వచ్చింది. థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయిందని హాస్టల్ సిబ్బంది చెప్పారు. జూలై 16న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రితి సాహ చనిపోయింది. తన కూతురి మృతి కేసులో విశాఖ పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఆరోపిస్తూ రితి సాహ తండ్రి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హాస్టల్, ఆసుపత్రి నుంచి సీసీటీవీ ఫుటేజీ సేకరించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆయన వాపోయారు.