‘సీ ప్లేన్’ ఆపరేషన్స్ ఏపీ రూపురేఖలను మార్చుతాయి: రామ్మోహన్ నాయుడు

గుజరాత్‌లో మొదలు పెట్టినప్పుడు ‌కొన్ని‌ సమస్యలు వచ్చాయని చెప్పారు.

‘సీ ప్లేన్’ ఆపరేషన్స్ ఏపీ రూపురేఖలను మార్చుతాయి: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu

Updated On : November 9, 2024 / 2:04 PM IST

విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’పై విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు వివరాలు తెలిపారు. ఇవాళ జరుగుతున్న సీ ప్లేన్‌ ఆపరేషన్స్ ఏపీ రూపురేఖలు మార్చడమే కాకుండా దేశ రూపు రేఖలు ‌మార్చనుందని తెలిపారు.

గుజరాత్‌లో మొదలు పెట్టినప్పుడు ‌కొన్ని‌ సమస్యలు వచ్చాయని చెప్పారు. చంద్రబాబు గైడ్ లైన్స్ తో‌‌ సీ ప్లేన్స్‌ తీసుకొస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన మార్గ దర్శకత్వంలో ఏ చాలెంజ్ వచ్చినా ముందుకు వెళుతున్నామని చెప్పారు.

అమరావతిలోనే సీ ప్లేన్స్‌కు ముందడుగు పడుతోందని తెలిపారు. ఉడాన్ స్కీంలోనికి సీ ప్లేన్స్‌ తీసుకొచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ సహకారం కోరినా అంగీకరిస్తామని తెలిపారు.

మంచి వాటర్ బాడీ, నదులువున్నా.. సీప్లేన్ ఏర్పాటు ‌చేస్తామని అన్నారు. డెమో రూట్‌ కింద ఈ రోజు‌ విజయవాడ నుంచి శ్రీశైలానికి రూట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నూతన ఎయిర్ పోర్టులకు కూడా సహకారం అందిస్తామని చెప్పారు.

బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత