Kodali Nani: ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం.. వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి

కృష్ణా జిల్లా గుడివాడలో కొత్తగా ఏర్పడిన విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.

Kodali Nani: ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం.. వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి

Kodali Nani

Updated On : January 29, 2022 / 1:12 PM IST

Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో కొత్తగా ఏర్పడిన విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ఎన్టీఆర్ వారసులం అని చెప్పుకునే సిగ్గుమాలిన వ్యక్తులు చేయలేని పని ముఖ్యమంత్రి జగన్ చేసి చూపించారని అన్నారు కొడాలి నాని.

పద్నాలుగేళ్లు అధికారంలో ఉండి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కనీసం ప్రపోజల్ కూడా పెట్టలేని వ్యక్తులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు నాని. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని రాద్దాంతం చేస్తూ, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు కొడాలి నాని.

సిద్ధాంతపరంగా వైఎస్ఆర్, ఎన్టీఆర్ విభిన్న ధృవాలైనా.. ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించేలా ఓ జిల్లాకు పేరు పెట్టారని చెప్పారు కోడాలి నాని. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు నాని.

ఎన్టీఆర్ పేరును ఓ జిల్లాకు పెట్టడాన్ని అభినందించాల్సిన తెలుగుదేశం రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. ఎన్టీఆర్‌ని ఆరాధించే వ్యక్తిగా, ఎన్టీఆర్ అభిమానుల తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు కొడాలి నాని.