Kolleru Lake : ఉధృతంగా ప్రవహిస్తున్న కొల్లేరు.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం
వరద ఉధృతి తగ్గేవరకు జాగ్రత్తలతో రాకపోకలు సాగించాలని గ్రామస్తులకు అధికారులు సూచనలు చేశారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది.

Kolleru Lake Floods
Kolleru Lake Flood: ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లా (Eluru District) కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో లంక గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడింది. వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నా గ్రామస్తులు లెక్కచేయడం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదపు అంచునే నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
నాగుళ్ళకోడు డ్రైన్ నుండి కొల్లేరుకు భారీగా నీరు చేరుతోంది. కొల్లేరుకు పెద్ద మొత్తంలో దెయ్యం చాపలు కొట్టు కోస్తున్నాయి. దెయ్యం చాపలతో అన్ని ఇబ్బందులేనని మత్స్యకారులు అంటున్నారు. వరద ఉధృతి తగ్గేవరకు జాగ్రత్తలతో రాకపోకలు సాగించాలని గ్రామస్తులకు అధికారులు సూచనలు చేశారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది.
Heavy Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరుగడంతో అధికారులు రెండో ప్రమాద స్థాయి హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కాగా, వర్షాలు తగ్గినప్పటికీ గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.
పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ వైపు
ప్రవహిస్తుండటంతో బ్యారేజీ వద్ద నీటి మట్టం 16 అడుగులకు చేరింది. 17.75 అడుగులకు నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. బ్యారేజీ నుంచి 16.20 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.