Heavy Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Heavy Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Rains (9)

Updated On : July 31, 2023 / 12:28 PM IST

Telangana Rains : తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడనున్నాయి. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఆదివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Rain today updates : పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరికలు జారీ

ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. తీవ్ర పంట నష్టం వాటిల్లింది.