ముద్రగడ పద్మనాభం కూతురు సంచలనం.. ‘మా నాన్నకు క్యాన్సర్.. మా అన్న ట్రీట్మెంట్ ఇప్పించడం లేదు..’

తన తండ్రి ఆరోగ్యం గురించి ఎలాంటి అప్‌డేట్లూ లేవని అన్నారు.

ముద్రగడ పద్మనాభం కూతురు సంచలనం.. ‘మా నాన్నకు క్యాన్సర్.. మా అన్న ట్రీట్మెంట్ ఇప్పించడం లేదు..’

Kranthi, Mudragada Padmanabham

Updated On : June 6, 2025 / 3:19 PM IST

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు, జనసేన నాయకురాలు క్రాంతి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌ వైరల్ అవుతోంది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారని, ఆయనకు అర్జెంటుగా చికిత్స అందించాల్సి ఉండగా తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా చికిత్స అందకుండా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తనను ముద్రగడ పద్మనాభం వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారని.. కానీ, తన సోదరుడు గిరి, అతని మామ అనుమతించలేదని క్రాంతి చెప్పారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎలాంటి అప్‌డేట్లూ లేవని, కనీసం దగ్గరి బంధువులు, ముద్రగడ సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని అన్నారు.

Also Read: నీటి దోపిడీ కోసం వారికి కేసీఆర్ సహకరించారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

గిరి, అతడి బంధువులు కలిసి ముద్రగడ పద్మనాభాన్ని బంధించి, ఎవరినీ కలవనివ్వకుండా ఉంచుతున్నారని తెలిసిందని ఆమె తెలిపారు. ఆయనతో ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నారని అన్నారు. ఇది కేవలం అమానవీయ ఘటన మాత్రమే కాదని, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చెప్పారు. రాజకీయ కారణాల కోసమే గిరి ఇలా చేస్తున్నట్లయితే, అతడిని వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.