KTR Birthday Celebrations : విజయవాడలో ఘనంగా మంత్రి కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ఐటీ, మున్పిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి.

KTR Birthday Celebrations : విజయవాడలో ఘనంగా మంత్రి కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు

KTR birthday celebrations

Updated On : July 24, 2023 / 1:58 PM IST

KTR Birthday Celebrations In Vijayawada :  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం విజయవాడ సింగ్ నగర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఏపీ సీనియర్ నేత కొణిజేటి ఆదినారాయణ (Konijeti Adinarayana) అభిమానుల సమక్షంలో ‌కేక్ కట్ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఆయనకు ఉండాలని కోరుకున్నానని చెప్పారు. భవిష్యత్తు లో మరిన్ని మంచి పదవుల్లో కొలువు తీరాలని ఆకాంక్షించారు. కేటీఆర్ కి ఏపీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ని కోరుతున్నామని తెలిపారు.

CPI Leader Narayana : కుట్రపూరితంగా మణిపూర్ ను మండిస్తున్న బీజేపీ.. బ్లాక్ మెయిల్, అరాచకాలు చేసి గిరిజనులను లొంగ దీసుకుంటున్నారు : సీపీఐ నేత నారాయణ

తెలంగాణ తరహాలో ఏపీలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా పీహెచ్ డీ చేసిన భారతికి ల్యాప్ టాప్ కానుకగా అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు లో కూడా ఏది చదివినా… తమ వంతు సాయం అందిస్తామని తమ అధ్యక్షులు చెప్పారని పేర్కొన్నారు.