Lance Naik Sai Teja : వీరుడా వందనం…సలామ్ సాయితేజ

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన.. పారా కమాండో సాయితేజ భౌతికకాయం ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తరలించారు.

Lance Naik Sai Teja : వీరుడా వందనం…సలామ్ సాయితేజ

Funneral Sai Chittur

Updated On : December 12, 2021 / 10:40 AM IST

Lance Naik Sai Teja Last Rites : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన.. పారా కమాండో సాయితేజ భౌతికకాయం ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తరలించారు. చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్ పోస్టు…వలసపల్లి మీదుగా..ఎగువరేగడకు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. సుమారు 30 కి.మీటర్ల దూరం ఉన్న రోడ్డుకిరువైపులా ప్రజలు బారులు తీరి..నివాళులర్పిస్తున్నారు. అంబులెన్స్ పై పువ్వులు చల్లుతూ లాస్ట్ సెల్యూట్ సమర్పిస్తున్నారు. జై జవాన్…అమర్ రహే నినాదాలతో మారుమ్రోగుతోంది. బరువెక్కిన హృదయాలతో ఎగువరేగడ వాసులు ఎదురు చూస్తున్నారు. సాయితేజ నివాసం వద్దే సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు అధికారులు నిర్వహించనున్నారు.

Read More : Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు.. గుజరాత్ వెళ్లిన బెజవాడ పోలీసులు

డీఎన్ఏ టెస్టుల ఆధారంగా.. సాయితేజ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆస్పత్రిలో ఆర్మీ అధికారులు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత.. ఢిల్లీ నుంచి సాయితేజ మృతదేహాన్ని కోయంబత్తూరు ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు ఎయిర్ లిఫ్ట్ చేసి.. ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఉంచారు. అక్కడ.. సైనికాధికారులు శ్రధ్ధాంజలి ఘటించి.. సెల్యూట్ చేశారు.

Read More : AP Govt : జగన్ సర్కార్ కీలక నిర్ణయం, ఆ జిల్లాలో మహిళా రుణాలన్నీ మాఫీ

భౌతికకాయాన్ని బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్‌ నుంచి.. రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఎగువరేగడి గ్రామానికి ఆయన
భౌతికకాయం రానుంది. చిత్తూరు జిల్లా మొత్తం సాయితేజ భౌతికకాయం కోసం బరువెక్కిన హృదయాలతో ఎదురుచూస్తోంది. సాయితేజ తమతో మాట్లాడిన చివరి విషయాలు గుర్తుకు తెచ్చుకుని తల్లడిల్లిపోతున్నారు.