AP Govt : జగన్ సర్కార్ కీలక నిర్ణయం, ఆ జిల్లాలో మహిళా రుణాలన్నీ మాఫీ

డ్వాక్రా రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా 8కోట్ల 98 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది.

AP Govt : జగన్ సర్కార్ కీలక నిర్ణయం, ఆ జిల్లాలో మహిళా రుణాలన్నీ మాఫీ

Cm Jagan Floods Ap

Waiver Of All Loans To Women : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన మహిళా బాధితులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కడప జిల్లా రాజంపేట మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన బాధిత మహిళల ఎస్‌హెచ్‌జీ, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల్లోని లోన్స్ మాఫీ చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ డ్వాక్రా రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా 8కోట్ల 98 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. అన్నమయ్య ప్రాజెక్టుకు వచ్చిన ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందున ఏకకాల పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Read More : Petrol Price India : కనికరం చూపుతున్న పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంత ?

రాజంపేట మండలంలోని గుండ్లూరు, మందపల్లి, పులపుత్తూరు, ఆర్.బుడుగుంటపల్లి, శేషాంబపురం, తాళ్లపాక రెవెన్యూ గ్రామాలకు చెందిన వారికి ఈ మాఫీ వర్తిస్తుందని గవర్నమెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ గ్రామీణ బ్యాంక్, కెనరా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో వివిధ పథకాల కింద ఉన్న మహిళల లోన్స్ మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

Read More : IAF Chopper Crash : నాన్నా.. నేనూ ఆర్మీలో చేరుతా! అమర జవాన్ టోపీ ధరించి కొడుకు సెల్యూట్.. వీడియో వైరల్

ఇటీవలే కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక ఇల్లు కూలిపోయాయి. రాష్ట్ర భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వరదల కారణంగా రోడ్డు, బ్రిడ్జిలు కూలిపోయాయి. కడప జిల్లాలో మృతుల సంఖ్య 40కి చేరాయి. రాజంపేట మండలం పరిధిలోని పులపత్తూరు, మందపల్లి, గుడ్లూరులో 39 మంది మృతి చెందినట్లు అధికారులు ఇటీవలే వెల్లడించారు. ఇందులో కొంతమందిని మాత్రమే గుర్తించారు. రోజులు గడుస్తున్నా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో..జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.