Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు.. గుజరాత్ వెళ్లిన బెజవాడ పోలీసులు

చెడ్డిగ్యాంగ్ ఆటకట్టించేందుకు ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు. సీసీ కెమెరాలు వారి కదలికల ఆధారంగా నలుగురిని గుర్తించారు పోలీసులు.

Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు.. గుజరాత్ వెళ్లిన బెజవాడ పోలీసులు

Cheddi Gang

Cheddi Gang చెడ్డిగ్యాంగ్ ఆటకట్టించేందుకు ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు. సీసీ కెమెరాలు వారి కదలికల ఆధారంగా నలుగురిని గుర్తించారు పోలీసులు. వీరు గుజరాత్ నుంచి ఏపీకి వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ లోని పలు ప్రాంతాలు దొంగలకు అడ్డాలుగా ఉంటాయి. వీరు ప్రత్యేక గ్రామాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.

చదవండి : cheddi gang In AP :బెజవాడను బేజారెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్..పోలీసులకు సవాల్ గా వరుస దోపిడీలు

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో దొంగతనాలకు పాల్పడిన వారు గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇక్కడ అనేక మంది దొంగలు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటారు. దేశంలో జరిగే మేజర్ దొంగతనాల్లో వీరి పాత్ర ఉంటుంది. ఒక గ్యాంగ్‌గా వచ్చి దోపిడీ చేసి వెళ్తుంటారు. ఇక వీరిని పట్టుకునేందుకు ఏపీ రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. స్థానిక పోలీసుల సాయం తీసుకోని రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీ చేస్తున్నారు. త్వరలో దొంగలను పట్టుకొంటామని చెబుతున్నారు పోలీసులు

చదవండి : Cheddi Gang : చెడ్డీ‌గ్యాంగ్ వేటలో తాడేపల్లి పోలీసులు

మరోవైపు మహారాష్ట్ర పార్థు గ్యాంగ్ కోసం మరో బృందం గాలింపు చేపడుతుంది. కాగా తాజాగా చెడ్డి‌గ్యాంగ్ ఏపీలోని ప్రముఖుల ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడింది. కృష్ణా గుంటూరు జిల్లాతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఈ చెడ్డీగ్యాంగ్ ఆనవాళ్లు కనిపించాయి. గంటలపాటు రెక్కీ నిర్వహించి 10 నిమిషాల్లో దోపిడీ పూర్తీ చేస్తుంది చెడ్డి గ్యాంగ్. చోరీ సమయంలో ఎవరైనా తిరగబడితే వారిని హత్యచేసేందుకు కూడా ఈ గ్యాంగ్ వెనుకాడడు.

చదవండి : Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌.. ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు

ఉత్తరాది నుంచి వస్తున్న ఈ దొంగలు ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ చోరీలు చేసి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతుంటారు. తిరిగి మరో ఏడాదికో రెండేళ్లకో వస్తుంటారు. వీరి చేష్టలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తమ ఇళ్లలోకి వస్తారనే భయంతో బిక్కుబిక్కున బ్రతికేస్తున్నారు.