Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌.. ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌ టెన్షన్‌ పెరుగుతోంది. నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ కదలికలు ఎక్కువగా ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు అన్ని పీఎస్‌లకు అలర్ట్‌ మెసేజ్‌లు పంపారు.

Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌.. ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు

Cheddi Gang

Cheddi gang tension in Tirupati : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌ టెన్షన్‌ పెరుగుతోంది. నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ కదలికలు ఎక్కువగా ఉండటంతో.. పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు అన్ని పీఎస్‌లకు అలర్ట్‌ మెసేజ్‌లు పంపారు. చెడ్డీ గ్యాంగ్‌ కోసం 6 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్టు తెలిపారు ఏఎస్పీ మునిరామయ్య. డీఎస్పీ నేతృత్వంలో 6 బృందాలు పనిచేస్తాయని, అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తిరుపతి నగరంలోని విద్యా నగర్‌కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో మూడు రోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించింది. అయితే ఆ ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో ఈ గ్యాంగ్ వెనుదిరిగింది. కానీ సీసీ ఫుటేజీలో కనిపించిన ఈ గ్యాంగ్ దృశ్యాలు నగర వాసులను కలవరానికి గురిచేశాయి. చెడ్డీ గ్యాంగ్‌లో ఉన్న వారు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో 10 మంది అరెస్ట్‌

రైళ్లలో నగరానికి వచ్చి.. రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, సంపన్నుల కాలనీలు, ఖరీదైన అపార్ట్ మెంట్లు ఈ గ్యాంగ్ టార్గెట్. ఒక ఏరియాలో దొంగతనం చేసిన తరువాత.. మళ్లీ ఆరు నెలలపాటు ఆ ప్రాంతం వైపు వెళ్లరు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ చెడ్డీగ్యాంగ్‌లపై కేసులు నమోదయ్యాయి.

చెడ్డీ గ్యాంగ్‌ చోరీలతో అప్రమత్తమైన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. అలాగే అప్టార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌ను పెట్టుకోవాలని, రాత్రిపూట వాచ్‌మెన్ విధులు నిర్వహించేలా చూడాలని ప్రజలను కోరుతున్నారు.