Laxmi Parvathi on her marriage: ఎన్టీఆర్‌తో నా పెళ్లిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: లక్ష్మీ పార్వతి

మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్‌తో తన పెళ్లిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి అన్నారు. అమరావతిలో ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తమ పెళ్లి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడి పార్టీ నేతలకు లేదని అన్నారు. తమ పెళ్లిపై తప్పుడు ప్రచారం చేస్తే కేసు పెడతానని హెచ్చరించారు. ఆనాడు వెన్నుపోటు పొడిచిన వారే నేడు ఎన్టీఆర్ విగ్రహాలకు దండలు వేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ భార్య అనేది తనకు పెద్ద పదవి అని, తాను వేరే ఏ పదవులు నేను అడగలేదని లక్ష్మీపార్వతి చెప్పారు.

Laxmi Parvathi on her marriage: ఎన్టీఆర్‌తో నా పెళ్లిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: లక్ష్మీ పార్వతి

Laxmi Parvathi on her marriage

Updated On : September 26, 2022 / 12:07 PM IST

Laxmi Parvathi on her marriage: మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్‌తో తన పెళ్లిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి అన్నారు. అమరావతిలో ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమ పెళ్లి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడి పార్టీ నేతలకు లేదని అన్నారు. తమ పెళ్లిపై తప్పుడు ప్రచారం చేస్తే కేసు పెడతానని హెచ్చరించారు. ఆనాడు వెన్నుపోటు పొడిచిన వారే నేడు ఎన్టీఆర్ విగ్రహాలకు దండలు వేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్టీఆర్ భార్య అనేది తనకు పెద్ద పదవి అని, తాను వేరే ఏ పదవులు నేను అడగలేదని లక్ష్మీపార్వతి చెప్పారు. పదవులు ఇస్తానని ఎన్టీఆర్ తనపై ఒత్తిడి పెట్టినా, తాను తీసుకోలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మళ్ళీ తనపై విష ప్రచారం చెయ్యడం మొదలుపెట్టారని ఆరోపించారు. ఎన్టీఆర్ కి చంద్రబాబు చేసిన దుర్మార్గానికి ఆయన కుటుంబ సభ్యులు వంత పాడారని చెప్పారు. చంద్రబాబు చేసింది వెన్నుపోటు కాదు హత్య అని అన్నారు.

చంద్రబాబు నమ్మించి గొంతు కోస్తాడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కి ద్రోహం చెయ్యనని చంద్రబాబు నాయుడు లోకేశ్ పై ప్రమాణం చేసి చెప్పి మాట తప్పారని అన్నారు. ఎన్టీఆర్ కొడుకులకి చంద్రబాబు విషం నూరి పోశాడని చెప్పారు. తండ్రికి జరిగిన అవమానం మీరు పట్టించుకున్నరా? అని ఎన్టీఆర్ కుమారులని లక్ష్మీ పార్వతి నిలదీశారు.

చివరి రోజుల్లో ఒక్కరైనా వచ్చి ఎన్టీఆర్ ని కలిశారా? అని ఆమె ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల కోసం ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఆమె చెప్పారు. ఇవాళ తండ్రి గురించి మాట్లాడటానికి సిగ్గు లేదా? అని లక్ష్మీపార్వతి నిలదీశారు.

COVID-19: దేశంలో కొత్తగా 4,129 మందికి కరోనా.. 43,415 యాక్టివ్ కేసులు