COVID-19: దేశంలో కొత్తగా 4,129 మందికి కరోనా.. 43,415 యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,688 మంది కోలుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 43,415 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.51 శాతంగా ఉందని పేర్కొంది.

COVID-19: దేశంలో కొత్తగా 4,129 మందికి కరోనా.. 43,415 యాక్టివ్ కేసులు

india corona cases

COVID-19: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,688 మంది కోలుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 43,415 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.51 శాతంగా ఉందని పేర్కొంది.

వారాంతపు పాజిటివిటీ రేటు 1.61 శాతంగా ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.72 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం 4,40,00,298 ఉన్నట్లు చెప్పింది. భారత్ లో ఇప్పటివరకు మొత్తం 217.68 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను వేసినట్లు తెలిపింది.

వాటిలో 94.78 కోట్ల రెండో డోసులు ఉన్నట్లు వివరించింది. బూస్టర్ డోసులు 20.44 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నిన్న దేశంలో 11,67,772 డోసులు వేసినట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 89.38 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 1,64,377 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

Indrakeeladri: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు.. పది రోజులు పది అవతారాల్లో అమ్మవారి దర్శనం