Japali Teertham As Hanuman Birthplace In Tirumala
Anjaneya Swamy Janma Sthanam In Tirupati : ఆంజనేయస్వామి జన్మస్థాన అభివృద్ధికి ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు విచ్చేస్తారని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుమలలోని అంజనాద్రిలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి మాఘ పౌర్ణమి పర్వదినం నాడైన ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం జరుగుతుందని వెల్లడించింది. విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి జీ మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు, శ్రీ కోటేశ్వర శర్మ వంటి ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ ఉత్సవానికి విచ్చేయనున్నారు.
Read More : Jagananna Chedodu Scheme : రూ.10వేలు రాలేదా? మార్చి 11లోపు ఇలా చేయండి…
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటల నుండి ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కానుందని తెలిపింది. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలం అంజనాద్రి – తిరుమల అనే పేరుతో పౌరాణిక – వాఙ్మయ – శాసన – చారిత్రికాధారాలతో ఓ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపింది. ఇందులో హనుమంతుని జన్మవృత్తాంతాన్ని పొందుపరిచినట్లు పేర్కొంది. తిరుమల ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలమని భౌగోళిక, పౌరాణిక, శాసన ఆధారాలతో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసి, సుందరీకరణ చేపట్టాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆకాశగంగ ప్రాంతంలోని అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారి ఆలయం ఎదురుగా ముఖ మండపం, గోపురాలు, ఇతర అభివృద్ధి పనులను దాతలు నారాయణం నాగేశ్వరరావు, కొట్టు మురళీకృష్ణ ఆర్ధిక సహాయంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఆనంద సాయి ఆధ్వర్యంలో చేపడతారని వెల్లడించింది.
Read More : AP Covid : ఏపీలో రాత్రి వేళ కర్ఫ్యూ తొలగింపు.. మాస్క్ కంపల్సరీ
అభయం ఇవ్వడం.. ఆనందం పంచడం.. హనుమంతుడి పేరు తలుచుకుంటే మనసులో స్పురించే మాటలు ఇవి ! అఖండ తేజోవంతుడిగా, దాసభక్తికి స్వరూపుడిగా, సకల గుణ సంపన్నుడైన హనుమాన్ జన్మస్థలం ఏంటన్న దానిపై ఎలాంటి ఆధారం లేదు. ఐతే మారుతి మనవాడే అంటూ జన్మస్థలం ప్రకటించింది టీటీడీ. హనుమంతుడు సర్వ దేవతా స్వరూపుడు. పరమ రామభక్తి, మహా వీరత్వం, జ్ఞానం, తెలివితేటలు, ధైర్యం, వినయం.. ఇలా ఎన్నో అద్భుతమైన అనంతమైన సుగుణాలతో ప్రతీ ఒక్కరి మనస్సులో స్ఫురించే దైవం మారుతి. భక్తి, యుక్తి, శక్తి, త్రివేణీ సంగమంలా సంగమించిన తత్వం హనుమంతునిది. సీతారాములకు ప్రాణదాత. మూర్తీభవించిన దాసభక్తి స్వరూపుడు. కార్య దీక్షాపరుడు.. మానవజాతికి మార్గదర్శకుడు, అభయప్రదాత ఆంజనేయస్వామి. లోక కల్యాణార్థం సీతారాముల కల్యాణాన్ని జరిపించినవాడు విశ్వామిత్రుడైతే… విడిపోయిన జంటను మళ్లీ కలిపి జగత్ కల్యాణం గావించినవాడు ఆంజనేయుడు. అభయం, ఆనందం భక్తులకు హనుమ అందించే రెండు వరాలు.
Read More : Uttar Pradesh : యూపీలో 10 రోజుల ముందుగానే హోలీ – మోదీ
సమస్త మానవాళికి ఆదర్శనీయం హనుమంతుడి జీవితం. అనుకరణీయమైన, ఆరాధించదగిన దైవత్వం కలబోసిన ఈశ్వరతత్వమే ఆంజనేయస్వామి. భయపడిన సుగ్రీవుడికి ధైర్యం నింపాడు. అశోకవనంలో శోకసంద్రంలో మునిగిపోయిన సీతకు రాముడి సందేశాన్ని చేర్చి సంతోషపరిచారు. సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలు నిలబెట్టి రాముడిని ఆనందపరిచారు. ఇలా అభయాంజనేయునిగా.. ఆనందాంజనేయునిడిగా సకల ప్రదాతగా భక్తుల పూజలు అందుకుంటున్నారు మారుతి ! ఐతే ఆయన జన్మ వృత్తాంతం గురించి తెలిసినా.. ఎక్కడ పుట్టారన్న దానిపై వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. ఐతే మారుతి మనవాడే అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం.. జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించింది.