AP Covid : ఏపీలో రాత్రి వేళ కర్ఫ్యూ తొలగింపు.. మాస్క్ కంపల్సరీ

మాస్క్ కంపల్సరీ ధరించే నిబంధన, మార్గదర్శకాలు కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సమావేశం...

AP Covid : ఏపీలో రాత్రి వేళ కర్ఫ్యూ తొలగింపు.. మాస్క్ కంపల్సరీ

Ap Night Curfew

Night Curfew Lifted In AP : ఏపీ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో.. పాజిటివ్ కేసులు నమోదవుతున్న క్రమంలో.. ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాత్రి వేళ కర్ఫ్యూ విధించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం కోవిడ్ నియంత్రణ,వాక్సినేషన్, ఆస్పత్రుల్లో నాడు నేడుపై సీఎం సమీక్ష జరిపారు. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ,సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళ ఉన్న కర్ఫ్యూ ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Read More : AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

అయితే.. మాస్క్ కంపల్సరీ ధరించే నిబంధన, మార్గదర్శకాలు కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సమావేశం నిర్ణయించింది. ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్న సీఎం జగన్ ఆదేశించారు. లక్షణాలు ఉన్న వారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తి చేయాలని, సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేర్వేరుగా చేయాలని, పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తన్న మూలవేతనంలో 50శాతం, వైద్యులకు 30 మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేశామని అధికారులు వెల్లడించారు.

Read More : Valimai: ప్రోమోకు పెయిడ్ లైక్స్.. నెట్టింట యాంటీ ఫాన్స్ దుమారం!

మరోవైపు…ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. మరొకరు కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒకరు చనిపోయారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 4వేల 636 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 15వేల 193 కరోనా టెస్టులు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,28,46,978 కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.