AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. తాజాగా మరొకరు కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒక కరోనా మరణం సంభవించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 4వేల 636 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15వేల 193 కరోనా టెస్టులు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,28,46,978 కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,13,212. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,83,788. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14వేల 698. రాష్ట్రంలో ప్రస్తుతం 14వేల 726 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారంతో(749 కేసులు, 3 మరణాలు) పోలిస్తే సోమవారం కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం.

Drinking Water : పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

మొన్నటి వరకు ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో కొత్త కేసులు భారీగా తగ్గాయి. దీంతో దేశ ప్రజలు కాస్త రిలీఫ్ అవుతున్నారు.

కాగా, దేశంలో కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. కొంతకాలంగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతుండటంతో మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కన్పిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 10.67లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 34వేల 113 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 10వేలకు పైగా తగ్గింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 3.19శాతానికి దిగొచ్చింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 75.18 కోట్ల కరోనా టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 10,67,908 కోవిడ్ పరీక్షలు జరిగాయి. దేశంలో ప్రస్తుతం 4,78,882 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదే సమయంలో కోవిడ్ మరణాలు కూడా సగానికి తగ్గడం ఊరటనిచ్చే అంశం. క్రితం రోజు 680కి పైనే మరణాలు నమోదవ్వగా.. తాజాగా ఆ సంఖ్య 346కు తగ్గింది. దేశంలోకి కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 5,09,011 మందిని బలితీసుకుంది. ఇక గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 91,930 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.68శాతానికి పెరిగింది.

కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,78,882 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 1.12శాతానికి తగ్గింది.

Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 11.66లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 172.95 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. 15-18 ఏళ్ల వయసు వారిలో 5.21 కోట్ల మందికి తొలి డోసు పూర్తవ్వగా.. 1.50 కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసుల టీకాను అందజేశారు. ఇప్పటి వరకు 1.73 కోట్ల ప్రికాషనరీ డోసులను పంపిణీ చేశారు.