Family Safe
Locals rescue family : చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది కాజ్‌వే దాటుతుండగా వరదనీటిలో కొట్టుకుపోతున్న భార్యాభర్తలు సహా మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. ఏర్పేడు మండలం శ్రీకాళహస్తి-పాపానాయుడు పేట ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. నిన్న సాయంత్రం వేదాంతపురం స్వర్ణముఖి నదిలో భార్య, భర్తతో పాటు.. వారి ఏడాది పిల్లాడు నదిలో చిక్కుకుపోయారు.
కాజ్ వే దాటుతున్న సమయంలో అందులో కొట్టుకుపోయారు. స్థానికులు గుర్తించి.. ఆ ముగ్గురిని గట్టుకు తీసుకువస్తుండగా.. నీటి ప్రవాహానికి మరోసారి అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయారు. దీంతో మరింత అప్రమత్తమైన స్థానికులు.. అధికారులతో కలిసి సహాయక చర్యలు నిర్వహించారు. నిన్న సాయంత్రం నుంచి ఆకలిదప్పులతో అరుస్తూ.. అక్కడే ఉన్న వారిని తాళ్ల సాయంతో అతి కష్టం మీద రక్షించారు.
MLC Elections : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులు వీరే..!
భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద చేరడంతో అధికారులు 11 గేట్లు ఎత్తి 15000 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. భారీ వర్షాల ప్రభావంతో బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి బ్రిడ్జి పై 5 అడుగులు పైన నీరు ప్రవహించటంతో వాలమేడు. పుచ్చలపల్లి. జెమీన్ కొత్తపాలెం, తూపిలిపాలెం,అందలమల గ్రామాలకు రాకపోకలు అధికారులు నిలిపివేశారు.
స్వర్ణముఖి బ్యారేజ్ దిగువ ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే పులికాట్ సరస్సు పొంగడంతో పంబలి. పులేంజరీపాలెం. శ్రీనివాసపురం. వాయట కుప్పం. గ్రామాలకు పూర్తిగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఆగ్రామాల ప్రజలు పడవ ప్రయాణం పై రాకపోకలు సాగిస్తున్నారు.