MLC Elections : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులు వీరే..!
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.

Sajjala
YCP candidates for the MLC elections : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి..11 మంది వైసీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
https://www.youtube.com/watch?v=ZHOutA1_hi8&t=15s
14 స్థానాల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేశామని తెలిపారు. ఏడుగురు బీసీ మైనారిటీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు..ఏడుగురు ఓసీలని పేర్కొన్నారు. సామాజిక సమీకరణ వల్ల కొందరు సీనియర్లు వెయిట్ చెయ్యాల్సి వస్తుందన్నారు.
ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ముందు ముందు అందరికీ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇదే ఆఖరి కాదు.. చాలా అవకాశాలు ఉన్నాయని..అర్థం చేసుకోవాలని కోరారు.
విజయనగరం…ఇందుకూరి రఘురాజు
విశాఖ… వరుదు కల్యాణి(బీసీ), వంశీ కృష్ణ యాదవ్(బీసీ)
తూర్పు గోదావరి.. అనంత ఉదయ్ భాస్కర్ (కాపు)
కృష్ణా.. తలశిల రఘురాం(కమ్మ), మొండితోక అరుణ్ కుమార్(ఎస్సీ)
గుంటూరు.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(కాపు), మురుగుడు హనుమంతరావు(బీసీ)
ప్రకాశం.. తూమాటి మాధవరావు(కమ్మ)
చిత్తూరు.. భరత్(బీసీ)
అనంతపురం.. శివరామిరెడ్డి